iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ హై అలెర్ట్.. పోలీసులకి అనుమానం వస్తే ఇక అంతే!

  • Published Aug 14, 2024 | 9:32 AM Updated Updated Aug 14, 2024 | 9:32 AM

Hyderabad High Alert: ఇటీవల దేశంలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకొని బాంబ్ దాడులకు పాల్పపడుతున్నారు. ఈ ఏడాది బెంగుళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే పంద్రాగస్టు సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించారు.

Hyderabad High Alert: ఇటీవల దేశంలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకొని బాంబ్ దాడులకు పాల్పపడుతున్నారు. ఈ ఏడాది బెంగుళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే పంద్రాగస్టు సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్ హై అలెర్ట్.. పోలీసులకి అనుమానం వస్తే ఇక అంతే!

భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్య నగరాలను ఉగ్రవాదుల సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. తాజాగా హైదరాబాద్ లో ఆంక్షలు విధించారు. గత ఐదు రోజులు నగరాన్ని పూర్తిగా జల్లెడ పట్టారు. వీఐపీల నివాసాలు, చారిత్ర కట్టడాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రత పెంచారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, హైటల్స్, పార్కుల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు అధికారులు.

ఐబీ హెర్చరికల నేపథ్యంలో జంట నగరాల్లో మరింత నిఘా పెంచారు. మంగళవారం రాత్రి పోలీసులు బాలాపూర్, పాతబస్తీ, మైలార్ దేవ్ పల్లి, పహాడీ షరిఫ్, ఫలక్ నూమా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చిరికలు ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ సిద్దంగా ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాలతో వందల మంది వలసదారులు బెంగాల్, ఒడిషాకు చేరుకున్న అక్రమదారులు ఉపాధి కోసం హైదరాబాద్ రావడం జరుగుతుంది.ఇప్పటికే బంగ్లా‌దేశ్ నుంచి చాలామంది దొంగ చాటుగా నగరంలోకి జొరపడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.