iDreamPost
android-app
ios-app

Rain Alert: HYDలో పట్టపగలే చీకట్లు.. బయటికి రావాలంటే భయపడుతున్న జనం!

  • Published Aug 31, 2024 | 9:13 AM Updated Updated Aug 31, 2024 | 9:13 AM

Rain Alert in Hyderabad: హైదరాబాద్ లో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. దాంతో ప్రజలు భయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Rain Alert in Hyderabad: హైదరాబాద్ లో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. దాంతో ప్రజలు భయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Rain Alert: HYDలో పట్టపగలే చీకట్లు.. బయటికి రావాలంటే భయపడుతున్న జనం!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతున్న క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ సూచించింది. అందులో భాగంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ ను ఉదయం నుంచే వానమబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లు ఉన్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడనం కారణంగా హైదరాబాద్ ను ఉదయం నుంచే వానమబ్బులు కమ్మేశాయి. దాంతో పగలే చీకట్లు అలుముకున్నాయి. ఇక రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దాంతో ఈ మూడు డిస్ట్రిక్స్ కు పింక్ అలెర్ట్ ను జారీ చేశారు.

Hyd rains

పట్టపగలే హైదరాబాద్ లో చీకట్లు కమ్ముకుంటున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ అయితేనే బయటకి రావాలని సూచిస్తున్నారు. కాగా.. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటానికి మరో 24 గంటల సమయం పడుతుంది. ఆ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక పట్టపగలే చీకట్లు కమ్ముకోవడంతో.. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అధికారులు కూడా వారిని బయటకు రావొద్దని సూచిస్తున్నారు.