Dharani
Singareni-Transfer Workers: కార్మికులకు శుభవార్త చెప్పడానికి సింగరేణి సంస్థ ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Singareni-Transfer Workers: కార్మికులకు శుభవార్త చెప్పడానికి సింగరేణి సంస్థ ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. అన్ని వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. సామాన్యుల సమస్యల గురించి మాత్రమే కాక.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సైతం పరిష్కరిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటూ పాలన సాగిస్తుంది. ఈ క్రమంలో తాాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థపై దృష్టి పెట్టింది. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ల ప్రారంభంతో పాటు.. దీర్ఘకాలంగా సంస్థలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
సింగరేణిలో పని చేసే బదిలీ వర్కర్లకు యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్‌లు(శాశ్వత ఉద్యోగులు)గా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. అంతేకాక సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో 190 రోజులు భూగర్భ గనుల్లో, మిగిలిన 240 రోజులు ఉపరితల గనుల్లో విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఎండీ బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాక సెప్టెంబరు 1 నుంచే వీరిని జనరల్ మజ్దూర్‌లుగా గుర్తించబోతున్నట్లు సింగరేణి సంస్థ ఎండీ బలరాం స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. వేర్వేరు కారణాల ద్వారా అనగా కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని ముందుగా బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. ఏడాది పాటు పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తారు.
ఇలా గుర్తించిన వారిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా ప్రమోషన్ పొందడానికి మాత్రమే కాక క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత దక్కించుకుంటారు. కార్మికులంతా క్రమశిక్షణతో పని చేయాలని సంస్థ ఎండీ బలరామ్ తెలిపారు. అలానే సింగరేణి ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా చేసినందకు కార్మికులు హర్షం వ్యక్తం చేయడమే కాక.. ధన్యవాదాలు తెలుపుతున్నారు.