Hyderabad: కళ్లముందే కాలిపోయిన EV బైక్.. ఇదే తప్పు మీరు కూడా చేస్తున్నారా?

Ev Bike Catches Fire In Hyderabad Suraram: విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈవీల వల్ల ఖర్చు తగ్గుతుంది అనడంలో సందేహం లేదు. కానీ, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి చేదు అనుభవమే మీకు కూడా జరగచ్చు.

Ev Bike Catches Fire In Hyderabad Suraram: విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈవీల వల్ల ఖర్చు తగ్గుతుంది అనడంలో సందేహం లేదు. కానీ, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి చేదు అనుభవమే మీకు కూడా జరగచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈవీ బండ్లకు మెయింటినెన్స్ తక్కువ ఉంటుంది. పైగా పెట్రోల్ ఖర్చులు ఉండవు. అంటే పర్సు మీద చాలా వరకు భారం తగ్గిపోతుంది. నెలకు కనీసం 1500 రూపాయల వరకు ఆదా అయితే చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టూ వీలర్ అయితే ఎలక్ట్రిక్ బండ్లు కొనేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అయితే ఎలక్ట్రిక్ స్కూటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈవీల వల్ల ఆర్థికంగా లాభాలు ఉంటాయి అనేది వాస్తవం. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల లాభాలు ఎలా ఉన్నాయో.. నష్టాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకు సంబంధించిన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విషయంలో వినియోగదారుల్లో ఒక పెద్ద భయం ఉంది. అవి ఎప్పుడు కాలిపోతాయి తెలీదు అని చాలామంది ఆరోపిస్తూ ఉంటారు. నిజానికి అలా ఈవీలు దగ్ధమైన సందర్భాలు చాలానే చూశాం. ఎక్కువ శాతం చార్జింగ్ పెడుతున్న సమయంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమవుతూ ఉంటాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్ మండలం సూరారం చౌరస్తాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. సూరారం జంక్షన్ లో ఉన్న మెడికల్ షాప్ ముందు ఎలక్ట్రిక్ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ బైకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు దుకాణానికి వ్యాపించాయి. మెడికల్ షాపు ముందు భాగం మొత్తం కాలిపోయింది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెడికల్ షాపులో మంటలను ఆర్పేశారు. చార్జింగ్ పెడుతున్న సమయంలోనే మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. చూస్తుండగానే ఈవీలో చెలరేగిన మంటలు దుకాణానికి వ్యాపించాయి అన్నారు. చార్జింగ్ పెట్టిన వైర్ ద్వారా మంటలు రివర్స్ లో దుకాణానికి అంటుకున్నట్లు కనిపించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈవీలు సేఫ్ కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీల విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఈవీ భద్రంగా ఉంటుంది. మీరు కూడా కచ్చితంగా సేఫ్ గా ఉంటారు.

ఈవీకి సంబంధించిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ముందు మీరు ఒక స్టేబుల్ పవర్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. పవర్ సోర్స్ అనేది ఫ్లక్చువేట్ కాకుండా ఉండాలి. ఈవీకి ఛార్జ్ పెట్టి వదిలేయడం కరెక్ట్ కాదు. అందుకే ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేయకండి. బ్యాటరీకి 100 శాతం ఛార్జింగ్ పెట్టడం కూడా ఒక్కోసారి ప్రమాదాలకు కారణం కావచ్చు. అందుకే మీ ఈవీకి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టండి. వాహనానికి ఛార్జ్ పూర్తైన వెంటనే డ్రైవ్ చేయకండి. అలా చేయడం వల్ల బ్యాటరీ వేడిగా ఉండి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే డ్రైవ్ చేసిన వెంటనే ఛార్జింగ్ పెట్టకండి. బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడు ఛార్జ్ పెట్టడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ హెల్త్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఈవీకి మంటలు అంటుకునే ప్రమాదం దాదాపుగా ఉండదు. ఈవీలను సాధ్యమైనంత వరకు షోరూమ్ కి చెందిన సర్వీస్ సెంటర్ కే తీసుకెళ్లండి. నిపుణులైన మెకానిక్లకే చూపించండి. మరి ఈవీ దగ్ధమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments