iDreamPost
android-app
ios-app

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ని మించిపోయిన బేగం బజార్.. గజం ఏకంగా 20 లక్షలు!

  • Published Aug 16, 2024 | 4:57 PM Updated Updated Aug 18, 2024 | 11:28 AM

Huge Land Rates In This Area: ఎంతోమంది ఆకలి తీర్చే నగరంగా హైదరాబాద్ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో భారీగా లాభాలు తెచ్చిపెట్టే అక్షయపాత్రగా ఉంది. సిటీలో స్థలం కొంటే తిరుగుండదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే అది ఇచ్చే లాభాలు అటువంటివి. అయితే హైదరాబాద్ లో ఒక ఏరియా మాత్రం జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాల కంటే మించిన లాభాలను ఇస్తుంది.

Huge Land Rates In This Area: ఎంతోమంది ఆకలి తీర్చే నగరంగా హైదరాబాద్ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో భారీగా లాభాలు తెచ్చిపెట్టే అక్షయపాత్రగా ఉంది. సిటీలో స్థలం కొంటే తిరుగుండదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే అది ఇచ్చే లాభాలు అటువంటివి. అయితే హైదరాబాద్ లో ఒక ఏరియా మాత్రం జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాల కంటే మించిన లాభాలను ఇస్తుంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ని మించిపోయిన బేగం బజార్.. గజం ఏకంగా 20 లక్షలు!

హైదరాబాద్ లో ఎక్కడ స్థలం కొన్నా గానీ సిరుల పంట కురిపిస్తుందని అంటారు. నిజమే ఒకప్పుడు వేల రూపాయలతో కొన్న భూమి విలువ ఇప్పుడు కోట్లు పలుకుతుంది. ఎకరం భూమిని పదివేలకు, పాతికవేలకి కొన్నవారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఖరీదైన ఏరియాలంటే కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాలని చెబుతారు. వీటిని మించిన ఏరియాలు లేవని అనుకుంటారు. రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ స్థలాల ధరలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ఓ ఏరియాలో మాత్రం స్థలాల ధరలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోకాపేట ఏరియాలని మించిపోయి మరీ ఉన్నాయి. హైదరాబాద్ ల్లో అన్ని ప్రాంతాల్లో ధరలు భారీగా ఉన్నాయన్నమాట వాస్తవమే కానీ ఈ ఏరియాలో మాత్రం మరీ భారీగా ఉంది.  

ఆ ఏరియా పేరు బేగం బజార్. బేగం బజార్ లోని ప్రధాన ప్రదేశాల్లో గజం స్థలం ధర రూ. 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పలుకుతుంది. ధర ఇంతలా ఉండడానికి కారణం అది బిజినెస్ హబ్ కావడం ఒకటి.. కొత్త స్థలాలు దొరక్కపోవడం మరొకటి. ఈ కారణాల వల్ల అక్కడ పాత బిల్డింగ్ లు, పురాతన ఇళ్ళకి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో యజమానులకి కోట్లలో కాసుల పంట కురిపిస్తున్నాయి. పాత బిల్డింగ్ లను పెద్ద సంఖ్యలో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఒక బిల్డింగ్ అమ్మకానికి పెడితే భారీగా వ్యాపారస్తులు వచ్చి వేలంపాటలో కొంటారంటే అక్కడ డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014కి ముందు బేగం బజార్ లో ఇంతలా లేవు ధరలు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

విభజనకు ముందు గజం స్థలం ధర రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల మధ్య ఉండేది. ఇప్పుడు ఏకంగా పదింతలు పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ ఏరియాలో డిమాండ్ ని బట్టి, లొకేషన్ ని బట్టి రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు పలుకుతుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడకు వచ్చి కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడిపోయారు. దుకాణాల కోసం విక్రయించే స్థలాల డిమాండ్ కూడా అలానే ఉంది. చదరపు అడుగు ధర ఏకంగా రూ. 70 వేల రూపాయల వరకూ ఉంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా ఈ రేట్లు లేవు. ఈ ఏరియాల్లో చదరపు అడుగు స్థలం ధర రూ. 20 వేల లోపే ఉంది. నిజాం కాలంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన హోల్ సేల్ వ్యాపారులు బేగం బజార్ ని కేంద్రంగా చేసుకుని వ్యాపారాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది హైదరాబాద్ లో ప్రముఖ హోల్ సేల్ మార్కెట్ గా మారిపోయింది. ఇక్కడ డైలీ వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.