iDreamPost
android-app
ios-app

భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు! పూర్తి వివరాలు ఇవే

  • Published Sep 01, 2024 | 11:46 AM Updated Updated Sep 01, 2024 | 11:46 AM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పరిస్థితులు చూస్తుంటే చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రతా కొరకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా నేడు పలు రైళ్లను క్యాన్సిల్‌ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పరిస్థితులు చూస్తుంటే చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రతా కొరకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా నేడు పలు రైళ్లను క్యాన్సిల్‌ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 01, 2024 | 11:46 AMUpdated Sep 01, 2024 | 11:46 AM
భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు! పూర్తి వివరాలు ఇవే

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసిన వాగులు, నదులు, చెరువులు, కాలువలు వరద నీళ్లతో పొంగిపోయి రహదారులన్ని జలమైయమవుతున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో అయితే ఏకంగా రైల్వే ట్రాక్‌ ల మీద నీరు స్తంభించిపోవడంతో రైల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

కాగా, ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే భారీ వర్షాల కారణంగా ఏపీలోని విజయవాడ డివిజన్‌ పరిధిలో దాదాపు 20 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల భద్రతా కొరకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే  తాజాగా మరో మారు దక్షిణ రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్య నిత్యం రాకపోకలు జరిగే కొన్ని రైళ్లను రద్దు చేసింది. అలాగే మరి కొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

భారీ వర్షాల వల్ల కారణంగా దక్షణ మధ్య రైల్వే ఈరోజు (02.09.24)   పలు ట్రైన్స్ రద్దు చేసింది మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.

రద్దైన రైళ్లు:

1. ట్రైన్ నెంబర్ 12713 విజయవాడ – సికింద్రాబాద్
2. ట్రైన్ నెంబర్ 12714 సికింద్రాబాద్ – విజయవాడ
3. ట్రైన్ నెంబర్ 17201 గుంటూరు – సికింద్రాబాద్
4. ట్రైన్ నంబర్ 17233 సికింద్రాబాద్ – సిరిపూర్ ఖాగజ్ నగర్
5. ట్రైన్ నెంబర్ 12706 సికింద్రాబాద్ – గుంటూరు
6. ట్రైన్ నెంబర్ 12705 గుంటూరు – సికింద్రాబాద్

గుంటూరు, నల్గొండ, పగడిపల్లి మీదుగా దారి  మళ్లించిన రైళ్లు:

1. నెంబర్ 20811, విశాఖపట్నం – నాందేడ్
2. నెంబర్ 12739 విశాఖపట్న – తిరుపతి
3. నెంబర్ 12759 తంబారం – హైద్రాబాద్
4. నెంబర్ 03241 దానాపుర్ – బెంగళూరు
5. నెంబర్ 12642 నిజమోద్దీన్ – కన్యాకుమారి
6. నెంబర్ 11019 CST ముంబై – భువనేశ్వర్

మరీ, రద్దు అయిన రైళ్ల వివరాలను గమనించి ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.