P Venkatesh
పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం వెళ్లిన ఆ యువకుడు ప్రాణాలే పోతాయని ఊహించి ఉండడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ మృతి చెందాడు.
పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం వెళ్లిన ఆ యువకుడు ప్రాణాలే పోతాయని ఊహించి ఉండడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ మృతి చెందాడు.
P Venkatesh
ప్రస్తుతం దేశ యువతను వేధిస్తున్న సమస్య నిరుద్యోగం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడి విదేశాలవైపు చూడాల్సిన పరిస్థితి దాపరించింది. ఇప్పటికే భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు బతుకుదెరువుకోసం వెళ్లిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. అయితే కొంత మంది ఏజంట్ల మోసాల వల్ల విదేశాలకు వెళ్లిన వారు నానా ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక, తినడానికి తిండి లేక నరకయాతన అనుభవిస్తున్నారు పలువురు. ఇదే విధంగా ఉద్యోగం కోసం హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు రష్యాకు వెళ్లాడు. బతుకుదెరువు కోసం వెళ్లిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బలై పోయాడు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నిర్విరామంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్ కారణంగా అక్కడి సైన్యంతో పాటు సాధారణ పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధం కారణంగా హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అఫ్సాన్ అనే యువకుడు ఉద్యోగం కోసం రష్యా వెళ్లగా అక్కడి ఏజన్సీ చేతిలో మోసపోయాడు. బలవంతంగా రష్యన్ ఆర్మీలో చేరండం వల్ల చివరాఖరికి ప్రాణాలు కోల్పోయాడు. కాగా అఫ్సాన్ సహా ముగ్గురు హైదరాబాద్ యువకులు ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి మోసపోయారు.
వారిని తిరిగి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతుండగానే విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఆర్మీలో చేరిన అతడు రష్యా తరఫున పోరాడుతూ మరణించాడు. దీనిపై మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఇక అఫ్సాన్ భౌతిక కాయాన్ని భారత్ కు తరలించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.