Swetha
చదువుకోసమో ఉద్యోగం కోసమో.. ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో అక్కడ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది.. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో మహిళ విషయంలో కూడా ఇలానే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చదువుకోసమో ఉద్యోగం కోసమో.. ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో అక్కడ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది.. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో మహిళ విషయంలో కూడా ఇలానే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Swetha
ఇండియాను విడిచిపెట్టి.. ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి పేరులు చెప్పి ఎంతో మంది ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అక్కడ వారు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం వార్తలను చూస్తూనే ఉన్నాము.. అలాగే అన్యాయంగా ఇతర దేశాల్లో మరణించిన భారతీయుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే.. మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అందులో హైదరాబాద్ వారు అధికంగా ఉండడం విషాదం.. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో మహిళ కూడా అమెరికాలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన బిందు ప్రియ అనే మహిళ.. ఆమె భర్త అంజనీ శ్రీకర్ బండ్లతో కలిసి అమెరికాలోని.. న్యూజెర్సీలో నివసిస్తోంది. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆమె కుటుంబం ఇద్దరు నుంచి ముగ్గురు అయ్యే సమయం దగ్గర పడిందని సంతోషించేలోపే.. విధి వారిని చిన్న చూపు చూసింది. బిందు ప్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయంలో.. అనుకోకుండా ఆఖరి ఊపిరి వదిలింది. దీనితో ఆమె భర్త అంజనీ శ్రీకర్ బండ్ల.. ఆమె అస్థికలను ఇండియాకు తరలించడానికి.. ఆమె అంత్యక్రియలను ఆచారాలను నిర్వహించేందుకు.. GoFundMe అనే నినాదంతో.. నిధులను సేకరించడం ప్రారంభించాడు. తన భార్య మృతిచెందిన బాధతో అతను మాట్లాడుతూ.. “దేవుడు బహుమతి ఇచ్చాడు. కానీ ఓ జీవితాన్ని బలి తీసుకున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆమె భార్య మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు .. శ్రీకర్ మాట్లాడుతూ..
““హాయ్, నా పేరు శ్రీకర్, నా భార్య అనుకోకుండా ప్రసవంలో మరణించింది. మేము ఆమెను భారతదేశానికి ట్రాన్స్ పోర్ట్ చేయాలి.ఎవరైనా ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే, అది చాలా అభినందనీయం. ఇది వేగవంతం, ఇతర అంత్యక్రియల ఊరేగింపుల కోసం ఉపయోగించబడుతుంది. ధన్యవాదాలు.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అమెరికాలో ఆమె అంత్యక్రియల ఖర్చుల కోసం కోసం ప్రారంభించిన GoFundMe పేజీ ద్వారా.. 40,000 డాలర్లు వచ్చాయి. కానీ, ఆమె మరణానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక యూస్ లో పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు ఎక్కువవుతుందంటూ.. పరిశోధనలు చెబుతున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.