iDreamPost
android-app
ios-app

Hyderabad: రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. అడ్డుకున్న అధికారులు

  • Published May 30, 2024 | 11:45 AM Updated Updated May 30, 2024 | 12:43 PM

హైదరాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన భూమిన కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడు ఓ రాజకీయ పార్టీ నాయకుడు. అయితే రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన భూమిన కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడు ఓ రాజకీయ పార్టీ నాయకుడు. అయితే రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఆ వివరాలు..

  • Published May 30, 2024 | 11:45 AMUpdated May 30, 2024 | 12:43 PM
Hyderabad: రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. అడ్డుకున్న అధికారులు

భూమిని నమ్ముకున్న వాడు ఎప్పటికి నాశనం కాడని అంటారు. వందల ఏళ్ల తరబడి.. ఎవరి దగ్గరైతే ఎక్కువ భూమి ఉంటుందో.. వారే అధిక ధనవంతులు అనే అభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది. ఇది వాస్తవం కూడా. ఒకప్పుడు అంటే భూములు ధరలు వందలు, వేలల్లో ఉండేవి. మరి ఇప్పుడు ల్యాండ్‌ రేట్లు.. చుక్కలను తాకుతున్నాయి. ఇక నగరంలో అయితే గజాల లెక్కన భూమి కొనాలన్నా.. లక్షలు, కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణలో అనేక ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎకరం ధర లక్షల్లో ఉంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. భూభకాసురులు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే.. చాలు వెంటనే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను సైతం వదలడం లేదు. ఇక తాజాగా నగరం నడిబొడ్డున సుమారు 500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు రాజకీయ నాయకులు. మరి చివరకు ఏం జరిగింది అంటే..

హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. నగర శివార్లలో అయితే ఎకరం వందల కోట్లు పలుకుతోంది. దాంతో తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాలకు యత్నిస్తున్నారు. తాజాగా.. నగరం సమీపంలోని గండిపేట మండలంలో రూ.500 కోట్ల ప్రభుత్వ భుమిని ఓ మాజీ కార్పొరేటర్ కబ్జాకు యత్నించాడు. గంధంగూడ గ్రామంలోని సర్వే నంబరు 51లో 9.36 ఎకరాల భూమి విషయంలో కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి.. స్థలం చుట్టూ తాత్కలిక ప్రహరీ నిర్మించారు. మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మించేందుకు స్కెచ్ వేశాడు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. సర్కారు భూములంటూ అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక వెల్లడించారు.

ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. వాటిని తొలగించాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ప్రభుత్వ భూరికార్డులను పరిశీలిస్తుండగా.. గంధంగూడలోని 9.36 ఎకరాల సర్కారు భూమి వ్యవహారం తెర మీదకు వచ్చింది. 1955 నుంచి అవి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయంటూ అభిషేక్‌కు నోటీసులు పంపారు అధికారులు. దాంతో ఈ ఏడాది మార్చిలో అభిషేక్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఆ భూములను అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని కోర్టులో విజ్ఞప్తి చేశాడు.. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం.. దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ భూములకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్‌ మరోసారి నోటీసులు జారీ చేశాడు. కానీ అభిషేక్‌ ఆధారాలు సమర్పించలేదు. దాంతో అతడు తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నించాడంటూ అభిషేక్‌కు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.