చలానాల్లో రికార్డులు బ్రేక్.. 5 నెలల్లో.. ఏకంగా 18 లక్షలు!

Hyderabad Motorists Records In Traffic Challan: అయ్యా బాబు రూల్స్ పాటించండి అంటే ఎవ్వరూ వినరు. ఈ తప్పు చేశావా ఇంత కట్టు అంటేనే కాస్త దారికి వస్తారు అని అనుకున్నారు. కానీ, అది కూడా ఆచరణలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫైన్ వేస్తే మేము కట్టినప్పుడు కదా అని మరీ నిర్లక్ష్యం చేస్తున్నారు.

Hyderabad Motorists Records In Traffic Challan: అయ్యా బాబు రూల్స్ పాటించండి అంటే ఎవ్వరూ వినరు. ఈ తప్పు చేశావా ఇంత కట్టు అంటేనే కాస్త దారికి వస్తారు అని అనుకున్నారు. కానీ, అది కూడా ఆచరణలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫైన్ వేస్తే మేము కట్టినప్పుడు కదా అని మరీ నిర్లక్ష్యం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం అంటే ఒకరి ప్రాణం పోవడం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. అంతటి అనర్థానికి కొన్నిసార్లు స్వీయ తప్పిదాలు కూడా కారణం కావచ్చు. అందులో ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే. ఒక్కోసారి 5 నిమిషాలు అంత దూరం ఎవరు తిరిగి వస్తారు.. ఈ రాంగ్ రూట్లో పోతే అయిపోతుంది అనుకుంటారు. కానీ, ఆ రాంగ్ రూట్లో జరగరానిది జరిగితే ఇంక తిరిగి రావడం ఉండదు. ఇలా రూల్స్ ని పెడచెవిన పెట్టి.. ఇష్టారీతిన బండ్లు తోలేవాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అందులో ముఖ్యంగా భాగ్య నగరవాసులో ఉంటున్నారు. అందుకు ఈ చలానాల లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పచ్చు.

ట్రాఫిక్ చలానాలు అనేవి హైదరాబాద్ మహానగరంలో సర్వ సాధారణం. అయితే వీటిలో కావాలనే చేసే తప్పులే ఎక్కువగా ఉంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం. హెల్మెట్ లేకపోతే ప్రాణం పోతుంది అని మొత్తుకున్నా.. నాకు నా నెత్తి మీద జుట్టు సోగ్గా ఉంటే చాలు అనుకునే ప్రబుద్ధులు పెరిగిపోయారు. అలాంటి వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ 5 నెలల కాలంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు 11.5 లక్షల చలానాలు వేశారు. ఈ ఒక్క పాయింట్ చాలు.. ప్రజలకు ప్రాణాల కంటే హెయిర్ స్టైల్ అంటేనే ఇష్టమని చెప్పడానికి. ఇంక హెల్మెట్ పెట్టి రూల్స్ బ్రేక్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్లు డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ లో ఫోన్ దూర్చేస్తారు. అలాంటి వాళ్లకి 31 వేల చలానాలు వేశారు.

ఇంక లిస్టులో ఆ తర్వాత సిగ్నల్ జంప్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడన్నా ఆరెంజ్ పడితే స్లో అవుతారు.. రెడ్ పడితే ఆగుతారు. అదేంటే కొందరికి మాత్రం రెడ్ సిగ్నల్ చూడగానే బండి వేసుకుని రయ్ అని వెళ్లాలి అనిపిస్తుంది. రెడ్ సిగ్నల్ చూడగానే ఆగకుండా వెళ్లిపోతారు. అలాంటి వారికి 34 వేల చలానాలు వేశారు. ఇంక ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ గురించి చెప్పుకోవాలి అంటే అలాంటి వారికి ఏకంగా 35 వేల చలానాలు వేశారు. అన్ని రూల్స్ పాటించకపోయినా మాకు చలానా పడదులే అని ధీమా వ్యక్తం చేసే వాళ్లు కొందరు ఉంటారు. అదే నంబర్ ప్లేట్ కి మాస్కులు వేసేవాళ్లు. అంకెలు కనపడకుండా గారడి చేసేవాళ్లు. అలాంటి వారికి ఏకంగా 37 వేల చలానాలు వేశారు. ఇలా కేవలం 5 నెలల్లోనే 18 లక్షల చలానాలు అంటే.. నెలకు సగటున 3.5 లక్షల చలానాలు. కేవలం 5 నెలలకే అంత అంటే.. ఇంక ఏడాదికి ఆ సంఖ్య ఎక్కిడికి వెళ్తుందో? చలానాలు వేస్తే మనం కట్టినప్పుడు కదా అని అనుకోవద్దు. ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. మీ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు మీ పర్స్ ని కూడా కాపాడుకోండి.

Show comments