P Krishna
Doctors Remove 418 Kidney Stones: హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యురాలజీ (ఏఐఎన్ యూ) లో నిపుణులైన యూరాలజిస్టుల వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
Doctors Remove 418 Kidney Stones: హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యురాలజీ (ఏఐఎన్ యూ) లో నిపుణులైన యూరాలజిస్టుల వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
P Krishna
హైదరాబాద్‌లో వైద్యులు తమ నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు. అతి క్లిష్టమైన ఆపరేష్ చేసి తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక ఆపరేషన్ చేశారు. రోగి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించారు. రోగికి ఎక్కువ బాధ, నొప్పి తెలియకుండా ఒక చిన్న రంధ్రం ద్వారా జరిగింది. ఇలా చేయడం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగి త్వరగా కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రోగి ఉన్న పరిస్థితిలో పెద్ద ఆపరేషన్ చేసి రాళ్లను తొలగించాల్సి ఉండేది.. కానీ ఎలాంటి నొప్పి తెలియకుండా వైద్య బృందం కీడ్నీ ఆపరేషన్ విజయవంతంగా ముగించారు.
60 ఏళ్ల వ్యక్తికి మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతని మూత్రపిండాలు 27% మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో కొంత కాలంగా విపరీతమైన నొప్పితో విల విలలాడిపోతున్నాడు. వైద్యులు అతన్ని పరీక్షించిన తర్వాత అతనికి అత్యాధునిక వైద్యం ద్వారా రాళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వైద్యులు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంటారు. కానీ దీనికి బదులుగా ‘పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటోమీ’ (PCNL) అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు. దీనితో రోగికి చిన్న రంద్రం చేసి సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్స్ తో మూత్ర పిండంలో చొప్పించి రోగి కిడ్నీలో రాళ్లను తొలగించేస్తారు.
ఈ పద్దతిలో రోగికి పెద్దగా బాధ కానీ, ఇబ్బందులు కానీ ఉండవు. అంతేకాదు రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్ల తొలగించారు. ఈ ఆపరేషన్ కోసం నిపుణులైన యూరాలజిస్టుల బృందం దాదాపు రెండు గంటల సమయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్ తో ఎంతో గొప్ప విజయం సాధించారు.. భవిష్యత్ లో ఇలాంటి ఆపరేషన్లకు ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి వైద్యం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.