iDreamPost
android-app
ios-app

Telangana: రాష్ట్రంలో అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు!

  • Published Aug 31, 2024 | 9:31 PM Updated Updated Aug 31, 2024 | 11:29 PM

Telangana, Heavy Rains, Hyderabad, Schools: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana, Heavy Rains, Hyderabad, Schools: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Aug 31, 2024 | 9:31 PMUpdated Aug 31, 2024 | 11:29 PM
Telangana: రాష్ట్రంలో అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు!

గత కొన్ని వారాలుగా ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు.. వరుణుడి ఉధృతిని చూసి భయపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవనం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు మొదలయ్యాయి. భారీగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ఏరియాల్లోనైతే వరద నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడ్రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడ్రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సర్కారు అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా హైదరాబాద్​లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నాడు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో అటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక, భారీ వర్షాలపై సీఎస్​ శాంతి కుమారి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వానల నేపథ్యంలో అలర్ట్​గా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్​.

అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు శాంతి కుమారి. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వానలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని, జిల్లాల్లో పరిస్థితిని హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్​కు అప్​డేట్ చేయాలని పేర్కొన్నారు. ఇక, భారీ వానల నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లాల్సిన పిల్లలు ఇళ్లకే పరిమితం అయ్యారు. పలు చోట్ల పాఠశాలలకు వచ్చిన స్టూడెంట్స్​ను తిరిగి ఇళ్లకు పంపించేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​లో సోమవారం స్కూళ్లకు ప్రకటించారు కలెక్టర్.