Keerthi
ప్రస్తుతం హైదరాబాద్ లోని కొత్త రైల్వే స్టేషన్ తర్వలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉండగా.. నాలుగో రైల్వేస్టేషన్ ఎయిర్‌పోర్టు రేంజ్ లో నిర్మాణమవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని కొత్త రైల్వే స్టేషన్ తర్వలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉండగా.. నాలుగో రైల్వేస్టేషన్ ఎయిర్‌పోర్టు రేంజ్ లో నిర్మాణమవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Keerthi
దేశంలోని అతిపెద్ద రవాణా నెట్ వర్క్ ల్లో రైల్వే నెట్ వర్క్ కూడా ఒకటి. ఇక్కడ నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. పైగా అన్ని రవాణా ఛార్జీల కన్నా రైలు ఛార్జీలు తక్కువ కావడంతో అందరూ ఈ ప్రయాణానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా.. తొందరగా తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకుంటారు.ఇక పండగల సీజన్లల అయితే ప్రతి ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. దీంతో పాటు రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో రద్దీగా నిల్చొడానికి స్థలం లేని విధంగా ఉంటుంది. ఇక అలాంటి సమయంలో రైల్వే స్టేషన్ల విస్తర్ణిత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యంకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రయాణికుల సౌకర్యం కోసం కల్పించేందుకు రైల్వే శాఖ కొత్త రైల్వే స్టేషన్లగా రూపుదిద్దడం కోసం అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నారు.
కాగా, ఇందులో భాగంగానే హైదరాబాద్ వంటి నగరంలోని కొత్త రైల్వే స్టేషన్ల పనులు పూర్తవతుండగా.. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణమవుతోంది. ఇక ఈ స్టేషన్ పనులు దాదాపు 98 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆ స్టేషన్ కు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక ఆ ఫోటోస్ కు అద్భుతమైన, అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ సిద్ధమైందని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు. అయితే ఆ ఫోటస్ ను చూస్తే.. చర్లపల్లి స్టేషన్ ఎయిపోర్టును తలపించేలా నిర్మించినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ స్టేషన్ డిజైన్, నిర్మాణం, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇకపోతే లోక్ సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ ఆలస్యం కావడంతో.. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే ఈ రైల్వే స్టేషనుకు రూ..434 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు తెలిపారు. కాగా, ఇది తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయని, ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతో మందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ స్టేషన్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. మొదట 6 ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు, ఆ తర్వాత 25 జతల దూరప్రాంత రైళ్లను నడపనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి అయితే ఈ రైల్వే స్టేషన్ 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించారు. ఇక ఇందులో 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్ ట్రైన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే విజయవాడ మీదుగా వచ్చే రైళ్లు కాచిగూడ స్టేషన్ మీదుగా బెంగళూరు, కర్నూలు వైపు వెళ్లే రైళ్లు కూడా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లకుండానే.. నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరి, ప్రస్తుతం ఎయిర్‌పోర్టు రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
𝐄𝐧𝐡𝐚𝐧𝐜𝐢𝐧𝐠 𝐑𝐚𝐢𝐥 𝐈𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐢𝐧 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚: 𝐂𝐡𝐚𝐫𝐥𝐚𝐩𝐚𝐥𝐥𝐢 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧
𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐮𝐩𝐝𝐚𝐭𝐞 : 𝟗𝟖% 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞𝐝
The new satellite terminal, set to become the fourth largest railway station in Telangana,… pic.twitter.com/jnuTAe8zYq
— G Kishan Reddy (@kishanreddybjp) July 13, 2024