iDreamPost
android-app
ios-app

జాక్ పాట్ కొట్టిన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్.. అదృష్టం అంటే ఇతనిదే..

  • Published Sep 16, 2023 | 3:35 PM Updated Updated Sep 16, 2023 | 3:35 PM
  • Published Sep 16, 2023 | 3:35 PMUpdated Sep 16, 2023 | 3:35 PM
జాక్ పాట్ కొట్టిన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్.. అదృష్టం అంటే ఇతనిదే..

బతుకుదెరువుకోసం పొట్ట చేత పట్టుకుని విదేశానికి వలస వెళ్లిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కుటుంబ పోషణ కోసం క్యాబ్ డ్రైవర్ గా మారిన ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. అతడే హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ నరేష్. గతంలో ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి మస్కట్ వెళ్లిన నరేష్ పది సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు గత నాలుగు సంవత్సరాల నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి అదృష్టం వరించింది. లాటరీ గెలుచుకుని లక్షల రూపాయలను సొంతం చేసుకున్నాడు. లాటరీ గెలుచుకోవడంతో క్యాబ్ డ్రైవర్ నరేష్ ఆనందంలో మునిగిపోయాడు.

చేసేది క్యాబ్ డ్రైవర్ వృత్తి, అరకొర జీతం.. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ నరేష్. అయితే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీ టికెట్ అయిన బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్(రూ. 22,63,680) ప్రైజ్ ని గెలుపొందాడు. 22 లక్షలకు పైగా లాటరీలో గెలుచుకోవడంతో నరేష్ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. తన కష్టాలు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను గెలుచుకున్న డబ్బులతో హైదరాబాద్ కు వెళ్లి వ్యాపారం ప్రారంభిస్తానని మస్కట్ లో ఉన్న క్యాబ్ డ్రైవర్ నరేష్ చెబుతున్నాడు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş