Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇవ్వనున్న రేవంత్‌ సర్కార్‌!

Pedda Vagu Flods-Compensation: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ. 20 వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

Pedda Vagu Flods-Compensation: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ. 20 వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. జోరు వానల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలానే ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి.. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అటు గ్రామాల్లోనూ కూడా ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. ఆ వివరాలు..

గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇక భద్రాద్రి జిల్లాలోని అశ్వారావు పేట సమీపంలో.. పెద్దవాగు ప్రాజెక్ట్‌కు గండి పడ్డ సంగతి తెలిసిందే. దీని వల్ల భారీ నష్టం వాటిల్లింది. వాగుకు గండిపడటం వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. గ్రామాల్లోకి వరద నీరు రావడంతో భారీగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదలు కొట్టుకుపోయాయి. దాంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు శుభవార్త చెప్పారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని, సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదని తెలిపారు మంత్రి పొంగులేటి. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మాటిచ్చారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 400 ఎకరాల మేర పంటపొలలా ఇసుక మేటతో పూడుకుపోయయని.. ఈ ఇసుక తీసేందుకు కొంత నగదు సాయం చేస్తామన్నారు. వరద కారణంగా పంటలు కొట్టుకు పోయిన వారికి విత్తనాలు ఉచితంగా అందిస్తామన్నారు.

వరదలో కొట్టుకుపోయిన గొర్రెలకు ప్రభుత్వం రూ.3 వేలు, ఆవులు, గేదెలకు ఒక్కో దానికి రూ.20 వేలు పరిహారం కింద ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. వరద వల్ల నీట మునిగి ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తామని మాటిచ్చారు. పెద్దవాగు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాక పెద్దవాగు తక్షణ మరమ్మతు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మాట్లాడి.. వెంటనే 8 కోట్ల రూపాయలు మంజూరు చేశాం అని చెప్పుకొచ్చారు.

Show comments