iDreamPost
android-app
ios-app

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త..ఆ రూల్స్ పాటించాల్సిందే..!

  • Published Nov 14, 2024 | 11:07 AM Updated Updated Nov 14, 2024 | 11:07 AM

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు.

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు.

  • Published Nov 14, 2024 | 11:07 AMUpdated Nov 14, 2024 | 11:07 AM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త..ఆ రూల్స్ పాటించాల్సిందే..!

తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల ఫైల్ పై తొలి సంతకం చేశారు.ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలు చేశారు. తెలంగాణలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో ఎలాంటి పైరవీలు లేకుండానే పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తున్నామని.. దానికి తుది మెరుగులు దిద్దడం పూర్తి అయ్యిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ చట్టం గురించి అసెంబ్లీలో వివరాలు వెల్లడిస్తామన్నారు. గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం ద్వారా అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలను లబ్దిదారులుగా ఎంపిక చేస్తామని, ఇంటి యజమానురాలి పేరునే ఇస్తామని అన్నారు. అలాగే మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కొన్ని రూల్స్ ప్రకటించారు. లబ్దిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలి. ఒక బాత్రూమ్, వంట గది తప్పనిసరి ఉండాలి. ఈ మేరకు ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారునికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5 లక్షల మంజూరు చేస్తుంది. పునాది నిర్మాణం పూర్తి కాగానే లక్ష, లెంటర్ లెవల్ కు చేరగానే రూ.1.25 లక్షలు, స్లాబు వేశాక రూ.1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిని లక్ష రూపాయలు ఇంటి యజమానురాలి పేరున మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలోన ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన వినతీ పత్రాలే అధికంగా వచ్చాయని  అన్నారు. గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నమూనాలు చూపించి ప్రజల ఓట్లు దండుకుందని విమర్శించారు. కానీ,  తమ వర్గానికి చెందిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి అసలైన అర్హులకు అన్యాయం చేసిందని ద్వజమెత్తారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేద ప్రజలను దారుణంగా మోసం చేసిందని, అది గమనించే ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారని అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పేరు చెప్పకొని కొంతమంది బడాబాబులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు అందాయి.   వాటన్నింటిని తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తాం అని మంత్రి అన్నారు. కొంతమంది అర్హులైన అన్నదాతలకు రూ.13 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేయాల్సి ఉంది, డిసెంబర్ లోపు ఆ రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పండించే ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.