iDreamPost
android-app
ios-app

రెయిన్ అలెర్ట్: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

రెయిన్ అలెర్ట్: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఇక గురువారం కూడా హైదరాబాద్ లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మధురా నగర్, పంజాగుట్ట, మధాపూర్, శ్రీనగర్, మీయాపూర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో వర్షం పాతం నమోదు అయింది. ఈ వర్షం కారణంగా కొద్దిసేపు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరీ ముఖ్యంగా అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లోనే కాకుండా సిరిసిల్ల, పెద్దపల్లి నిర్మల్ జిల్లాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా ప్రకటించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తగా ఉండాలంటూ సూచించింది. కాగా ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేయడం విశేషం.