P Krishna
Telangana High Court: గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ - 1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Telangana High Court: గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ - 1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
P Krishna
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు గ్రూప్ – 1 రగడ కొనసాగుతుంది. సింగిల్ బెంజ్ తీర్పును రద్దు చేసి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సదరు అభ్యర్థుల పిటీషన్లను హైకోర్టు డివిజన్ బెంజ్ కొట్టివేసింది. అదే సమయంలో సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధిస్తూ మెయిన్స్ పరీక్షలకు లైన్ క్రీయర్ చేసింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. జీవో 29 రద్దుతో పాటు గ్రూప్ – 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొన్నిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతుంది. మొత్తానికి మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గ్రూప్ – 1 అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. జివో 29 రద్దు తో పాటు గ్రూప్ – 1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కోరుతూ సంబంధింత అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం తాజాగా పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటీషన్లను హై కోర్టుల డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హై కోర్టు. ఈ సందర్బంగా హై కోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదు, కేవలం 8 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బంది పడాలి అని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దయ్యింది.పరీక్షల కోసం అహర్శశలు కష్టపడి చదువిన వాళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల గ్రూప్ – 1 పరీక్షలు నిర్వహించుకోవచ్చని హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రిలీమ్స్ లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీ లో సరైన సమాధానాలు ఇవ్వలేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి కొత్త జాబితా రిలీజ్చేయాలని వారు పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటీషన్లను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ – 1 పరీక్షలు యదాతథంగా జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలజ్ చేసింది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ – 1 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్ – 1 పరీక్షలకు 31, 383 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ పరీక్షల్లో రిజర్వేషన్లు పాటించడం లేదని, జీవో 29 ని సవరించిన తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వరకు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నా చేశారు. గతంలో ప్రిలిమ్స్ పరీక్షల్లోని తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు అశోక్ నగర్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ధర్నాకు దిగారు. వీరికి తోడుగా నిరుద్యోగులు సైతం తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలకు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్ – 1 పై న్యాయస్థానంలో ఉన్న కేసులు కొల్లిక్కి వచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పెద్ద ఎత్తున టాఠీ చార్జీలు చేశారు. అరెస్ట్ చేసి వారందరినీ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మొత్తానికి ధర్నాలు, నిరసనలు కొనసాగున్న నేపథ్ంలో తెలంగాణ కోర్టు మెయిన్స్ యథావిధిగా నిర్వహించుకోవచ్చు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది.