iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. పిటిషన్లు కొట్టివేత!

  • Published Oct 15, 2024 | 11:36 AM Updated Updated Oct 15, 2024 | 11:36 AM

Telangana High Court: తెలంగాణలో గ్రూప్ - 1 పరీక్షల నిర్వహణకు అడ్డు తొలగిపోయింది. ఇటీవల నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటీషన్లను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్ చెప్పింది.

Telangana High Court: తెలంగాణలో గ్రూప్ - 1 పరీక్షల నిర్వహణకు అడ్డు తొలగిపోయింది. ఇటీవల నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటీషన్లను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్ చెప్పింది.

  • Published Oct 15, 2024 | 11:36 AMUpdated Oct 15, 2024 | 11:36 AM
బ్రేకింగ్: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. పిటిషన్లు కొట్టివేత!

టీజీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ 2024 ఎగ్జామ్స్ ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ టీజీపీఎస్సీ కమిషన్‌ ఏర్పట్లలో నిమగ్నమై ఉండగా.. 10 కి పైగా నోటీఫికేషన్ సవాల్ చేస్తూ హై కోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో నిర్వహించిన గ్రూప్ – 1 పరీక్షలో ఏడు ప్రశ్నలు తప్పగా వచ్చాయని, తమకు అన్యాయం జరుగుతుందని పరీక్షలు రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ జరిపిన హై కోర్టు తీర్పును రిజర్వూ చేసింది. నేడు ఆ పీటీషన్లపై తీర్పు ఇస్తూ గ్రూప్ – 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ గ్రూప్ – 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’ లో సరైన జవాబులు ఇవ్వలేదని పది మంది అభ్యర్థులు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ కొత్త జాబితా ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్నారు. సదరు అభ్యర్థుల పిటీషన్లపై విచారణ చేపట్టిన హై కోర్టు వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే గ్రూప్ – 1 పరీక్షలు యధాతథంగా జరుపుకోవచ్చని తీర్మాణించింది. దీంతో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 వ తేదీ నుంచి 27 తేదీ వరకు TGPSC గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ఈ ఎగ్జామ్స్ హైదరాబాద్ (హెచ్ఎండీఏ) పరిధిలో జరగనున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. తొలిరోజు తీసుకు వెళ్లిన హాల్ టికెట్ మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది.. రోజుకో కొత్త హాల్ టికెట్ తో వెళితే ఇన్విజిలేటర్లు ఎగ్జామ్స్ కి అనుమతించబోరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి ఎగ్జామ్ హాల్‌కి హాల్ టికెట్ తీసుకువెళ్లవలసి ఉంటుందని, ప్రతి పరీక్ష రోజు హాల్ టిక్కెట్ పై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది.