iDreamPost
android-app
ios-app

హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట!

  • Published Aug 08, 2024 | 5:14 PM Updated Updated Aug 08, 2024 | 5:28 PM

Raj Tarun Bail: టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. అతడిపై ఏకంగా పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి భారీ ఊరట లభించింది.

Raj Tarun Bail: టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. అతడిపై ఏకంగా పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి భారీ ఊరట లభించింది.

  • Published Aug 08, 2024 | 5:14 PMUpdated Aug 08, 2024 | 5:28 PM
హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట!

గత కొన్నిరోజులగా టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనని మోసం చేసి.. వేరే హీరోయిన్ తో  ప్రేమాయణం సాగిస్తున్నాడన్న లావణ్య ఆరోపణలు చేసింది. అంతేకాక  నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ హీరోయిన్, ఆమె సోదరుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ కి రిలీఫ్ వచ్చింది. మరి.. ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. అతడు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని రోజుల క్రితం లావణ్య..రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైట్ ఇచ్చింది. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య పెళ్లి చేసుకున్నామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే హీరోయిన్ తో లవ్ లో ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక తనపై నమోదైన కేసు విషయంలో రాజ్‌ తరుణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

దీంతో  రాజ్ తరుణ్ పిటిషన్ ను విచారించిన కోర్టు.. అతడి ఊరటను ఇచ్చింది. రాజ్ తరుణ్ కి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. 20 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.  ఇటీవల రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో  అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదంలోకి కొందరు కొత్త వ్యక్తులు కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజ్ తరుణ్ సన్నిహితుడు,  ఆర్ జే శేఖర్ బాషా  కూడా లావణ్యపై  పలు ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు కూడా ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చారు.

తనకు లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ఆ యువతి ఆరోపించింది. అంతేకాక లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తుదంటూ కూడా ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో లావణ్య కూడా వారిపై అదే స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఇలా ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే రాజ్ తరుణ్ కి భారీ ఊరట లభించింది. ఇదిఇలా ఉంటే.. రాజ్ తరుణ్ ఇటీవల రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలుత ‘పురుషోత్తముడు సినిమాతో థియేటర్లలో సందడి చేయాగా..ఇటీవల ‘తిరగబడరసామీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. తిరగబగడరసామీ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. తిరగబడరా సామీ సినిమాలో మాల్వీ మల్హోత్ర, రాజ్ తరుణ్ కి జోడీగా నటించింది. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss