iDreamPost
android-app
ios-app

హైడ్రాకున్న చట్టబద్దత ఏంటి? హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్ట్‌ సీరియస్‌!

  • Published Sep 30, 2024 | 12:22 PM Updated Updated Sep 30, 2024 | 12:22 PM

Telangana High Court, Hydra Commissioner Ranganath, Ameenpur: హైడ్రా కూల్చివేతలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్‌ రంగనాథ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Telangana High Court, Hydra Commissioner Ranganath, Ameenpur: హైడ్రా కూల్చివేతలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్‌ రంగనాథ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Sep 30, 2024 | 12:22 PMUpdated Sep 30, 2024 | 12:22 PM
హైడ్రాకున్న చట్టబద్దత ఏంటి? హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్ట్‌ సీరియస్‌!

హైడ్రా పేరు చెబితేనే హడలిపోతుంది హైదరాబాద్‌ మహానరగరం. ఆదివారం వస్తే చాలు.. హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ తమ ఇళ్లను కూల్చుతాయో అని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే తమ దృష్టికి వచ్చిన మోషన్‌ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటంటూ.. మండిపడింది. అడిగిన వాటికి మాత్రమే సమాధాన చెప్పాలంటూ హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌ను కూడా హెచ్చరించింది. సోమవారం జరిగిన విచారణకు అమీన్‌పూర్‌ తహసీల్డార్‌ హాజరుకాగా.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వర్చువల్‌గా హాజరయ్యారు.

విచారణలో భాగంగా.. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్దత గురించి చెప్పాలంటూ కోరింది. ఆదివారం సెలవు దినాల్లో కూల్చివేతలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురుకలు అంటించింది. చట్టాలను ఫాలో అవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు.. తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌ని హెచ్చించింది కోర్టు. మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతులకు సంబంధించి తమ ముందు 20 లంచ్ మోషన్ పిటిషన్లు ఉన్నాయని చెప్పిన న్యాయమూర్తి.. అలా ఎలా కూల్చివేతలు చేస్తారంటూ అమీన్‌పూర్‌ తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు, చట్టానికి లోబడి పనిచేయకుంటే.. ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. జాగ్రత్త అంటూ తహసీల్దార్‌ను హెచ్చరించారు.

అయితే.. సెప్టెంబర్‌ 21న అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కూల్చివేతల కోసం మిషనరీస్‌ కావాలని తనకు లేఖ రాసినట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హైకోర్టుకు తెలిపారు. ఆయన మిషనరీలు అడిగితే మీరెలా పంపిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఫాలో అవ్వకుండా, రూల్స్‌ పాటించకుండా ఇష్టానుసారం కూల్చివేతలు ఎలా చేపడతారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్‌ అయ్యారు. బాధితులకు సమయం ఇవ్వకుండా కూల్చివేతులు చేపట్టడం ఏంటి, ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడింది. హైడ్రా విషయంలో సంతృప్తిగా లేమంటూ హైకోర్టు ప్రకటించింది. కూల్చివేతలపై సామాన్యులకు ఏ విధంగా వివరణ ఇస్తారని అడిగింది కోర్టు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అలాగే అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది.