iDreamPost
android-app
ios-app

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

  • Published Sep 09, 2024 | 8:54 PM Updated Updated Sep 09, 2024 | 8:54 PM

Petition in High Court on Vinayaka Immersion: హైదరాబాద్ లో వినాయక చతుర్థి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పలు వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి గణేషుడి విగ్రహాలు ప్రతిష్టించారు. తాజాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Petition in High Court on Vinayaka Immersion: హైదరాబాద్ లో వినాయక చతుర్థి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పలు వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి గణేషుడి విగ్రహాలు ప్రతిష్టించారు. తాజాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం..  హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా.. మంగళ మూర్తీ మోరియా అనే కీర్తనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వినాయ చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన ఘనంగా జరుపుకున్నారు. ఇక విధుల్లో ఎక్కడ చూసినా గణపతి మండపాలు అందంగా అలంకరించి అందులో గణపతి మూర్తిని ప్రతిష్టించారు. నవరాత్రులు ఎంతో నిష్టతో పూజలు చేస్తారు భక్తులు. కొంతమంది మూడు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులు పూజ ఊరేగింపుతా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.

హైదరాబాద్   హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం చేయవొద్దని ఈ నెల 3న తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కనుక ప్రతివాది హైడ్రాని కూడా చేర్చాలని పిటీషన్ లో కోరారు. అంతేకాదు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని పీటీషనర్ హై కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా? అని పిటీషనర్ ని ప్రశ్నించింది.

వినాయక చవితికి ముందు పిటీషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి పెంచడం సరైనది కాదని పిటీషనర్ కి సూచించింది. అయితే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలిస్తామని పేర్కొటూ.. విచారణ నేటికి (సెప్టెంబర్ 9) వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పిటీషనర్ పై నేడు మరోసారి విచారణ జరిపిన హై కోర్టు.. తదుపరి విచారణ రేపు (సెప్టెంబర్ 10)న విచారించనున్నట్లు  జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ వెల్లడించింది. మరి ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు హుసేస్ సాగర్ లో ఉంటాయా? లేదా? ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తారా? అన్నది రేపు కోర్టులో తేలనుంది. గత కొంత కాలంగా హుస్సేన్ సాగర్ లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం ముప్పు వాటిల్లుతుందని వాదనలు వినిపిస్తు్న్నాయి.