P Venkatesh
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్ లభించింది. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్ లభించింది. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
P Venkatesh
యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. హర్షసాయి వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఇతనికి సినిమా స్టార్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పేదలకు డబ్బు సాయం చేస్తూ దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో అంతా హర్షసాయి జపమే చేస్తుండే వారు. అయితే ఇటీవల యూట్యూబర్ హర్షసాయిపై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ యువతి తనను లైంగికంగా వేధించాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకుని మోసం చేశాడని కంప్లైంట్ లో పేర్కొంది.
ఓ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి తన అపార్ట్ మెంట్ కు పిలుచుకుని వేధించాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రిపైన కూడా కంప్లైంట్ చేసింది బాధితురాలు. యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు సెప్టెంబర్ 24న కేసు నమోదు చేశారు. హర్షపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హర్షసాయి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్నహర్షసాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హర్ష సాయి కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరిపిన కోర్టు హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతనికి అరెస్ట్ నుంచి విముక్తి కలిగినట్లైంది. హర్షసాయికి ముందస్తు బెయిల్ రావడంతో బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపింది.
కాగా హర్షసాయి పై మూవీ ప్రొడ్యూసర్ కూడా కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హర్షసాయి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో హర్షసాయి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సాయం చేసినోడే నేరాలు కూడా చేశాడనే ఆరోపణలు రావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. మరి హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.