iDreamPost
android-app
ios-app

Hyderabad: ఇక మహా గ్రేటర్ గా విస్తరించనున్న హైదరాబాద్.. ముంబై కూడా ఇక పనికిరాదు!

  • Published Apr 02, 2024 | 8:22 AM Updated Updated Apr 02, 2024 | 12:09 PM

ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ మహా నగరాన్ని ఇంకా విస్తరించేందుకు.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ మహా నగరాన్ని ఇంకా విస్తరించేందుకు.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 02, 2024 | 8:22 AMUpdated Apr 02, 2024 | 12:09 PM
Hyderabad: ఇక మహా గ్రేటర్ గా విస్తరించనున్న హైదరాబాద్.. ముంబై కూడా ఇక  పనికిరాదు!

హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ఎంత అభివృద్ధి చెందిందో తెలియనిది కాదు.రాష్ట్ర నలుమూలల నుంచి.. ఉపాధి కోసం ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఎంతో మందికి హైదరాబాద్ మహా నగరం.. ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో.. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ నగరం.. మహా గ్రేటర్ హైదరాబాద్ గా విస్తరించనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు.. భాగ్యనగరాన్ని.. ఔటర్ రింగ్ రోడ్ వరకు.. విస్తరింపచేయాలనే ప్లాన్ లో ఉన్నారు అధికారులు. లోక్ సభ ఎన్నికల తర్వాత.. దీనికి సంబంధించిన ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి.. సమర్పించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాలను GHMCలో విలీనం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. వచ్చే జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేసే దిశగా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కనుక.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న 150 డివిజన్లు.. 210 డివిజన్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అలాగే, సిటీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరింత ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. మహా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ప్లాన్ ను.. ప్రాధమిక ఎన్నికల కోడ్ తర్వాత.. సీఎం ముందు ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఒకవేళ ఇదే కనుక జరిగితే, ముంబై కూడా హైదరాబాద్ ముందు పనికిరాదని చెప్పి తీరాలి.

ఇక హైదరాబాద్ GHMC విషయానికొస్తే.. 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామపంచాయితీలను కలిపి ఈ GHMC ని ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో సుమారు 1కోటి జనాభ ఉన్న కారణంగా.. 150 డివిజన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతున్నా కానీ.. హైదరాబాద్ చుట్టూ ఉన్న.. 21 పురపాలక సంఘాలలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో.. ఇప్పుడు వాటిని కూడా డెవలప్ చేసి .. మహా గ్రేటర్ హైదరాబాద్ గా రూపుదిద్దాలనే .. ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అధికారులు.. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.