Google-Chilkur Temple Closed On Saturday, Sunday: శని, ఆదివారాలు చిలుకూరి గుడి క్లోజ్‌ అంటూ చూపిస్తోన్న గూగుల్‌.. అసలు విషయం ఇది

శని, ఆదివారాలు చిలుకూరి గుడి క్లోజ్‌ అంటూ చూపిస్తోన్న గూగుల్‌.. అసలు విషయం ఇది

Chilkur Temple: చిలుకూరి బాలాజీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఆలయానికి సంబంధించి గూగుల్‌లో తప్పుడు సమాచారం వైరల్‌ అవుతుంది.

Chilkur Temple: చిలుకూరి బాలాజీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఆలయానికి సంబంధించి గూగుల్‌లో తప్పుడు సమాచారం వైరల్‌ అవుతుంది.

నగరంలోని చిలుకూరి గుడి ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే. వీసా బాలాజీగా ఇక్కడ స్వామి వారు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని.. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలని చెబుతారు. ఇక ఆలయానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక శని, ఆదివారాల్లో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం గుడిలో పంచే గరుడ ప్రసాదం కోసం భక్తులు ఎంత భారీ ఎత్తున తరలి వచ్చారో చూశాము. ఈ క్రమంలో తాజాగా మరోసారి చిలుకూరి బాలాజీ ఆలయం వార్తల్లో నిలిచింది. శనివారం, ఆదివారం ఆలయం క్లోజ్‌ అంటూ గూగుల్‌లో కనబడుతుంది. దాంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. అసలేం జరిగిందంటే..

చిలుకూరి దేవాలయానికి సంబంధించి గూగుల్‌లో తప్పుడు సమాచారం కనిపిస్తోంది. శనివారం, ఆదివారం ఆలయం క్లోజ్‌ అంటూ గూగుల్‌ చూపిస్తోంది. దాంతో భక్తులు ఆందోళన చెందడమే కాక ఇది నిజమేనా అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆలయానికి సంబంధించిన వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో దీనిపై చిలుకూరి ఆలయ అర్చకులు రంగరాజన్‌ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది.. అలాంటిది ఆ రోజున ఆలయం ఎందుకు మూసి వేస్తామని ప్రశ్నించారు. అంతేకాక వారాంతరాలైన శని, ఆదివారాల్లో గుడి తెరిచే ఉంటుందని.. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని భక్తులకు ఆయన సూచించారు.

ఇక ఈ విషయంపై ఆలయ ప్రధాన ఆర్చకులు రంగరాజన్‌ మండిపడ్డారు. గూగుల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు గూగుల్‌ ఎవరు.. ఎందుకు ఇలా ఆలయం గురించి తప్పుడు సమాచారం చూపిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. ఎలాంటి అంతరాయం లేకుండా గుడి తెరిచి ఉంటుందని.. ఇలాంటి తప్పుడు సమాచారం అందించవద్దని భక్తులు కూడా గూగుల్‌కి సూచించాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరారు.

Show comments