Good News for Farmers:రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త!అప్పటి వరకు వారికి కూడా వర్తింపు!

రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త! అప్పటి వరకు వారికి కూడా వర్తింపు!

Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రైతు రుణ మాఫీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రైతు రుణ మాఫీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

గత ఏడాడి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పథకాల అమలు విషయంలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం ప్రారంభిచారు. ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి ఏకరాకు రూ.10 వేల చోప్పున నష్టపరిహారం అందించారు. తాజాగా రైతులకు మరోశుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ హామీ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రైతులకు హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాజాగా రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం అవుతాయని.. రైతు సంక్షేమ కార్పోరేషన్ కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.

ఒకవేళ అలా కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుంది తెలంగాణ సర్కార్. కాగా, ప్రభుత్వం కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనుండగా.. అంతకు మించి రుణం ఉంటే అది మాత్రం వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు ఉంటే వాటన్నింటిని కలిపి లెక్కతీయనున్నారు.బంగారం తాకట్టు పెట్టిన తెచ్చుకున్న రుణాలు మాఫీ కానున్నట్లు తెలుస్తుంది.అయితే దీర్ఘకాలిక రుణాల మాఫీ వర్తించదనే చర్చ జరుగుతుంది.. కాకపోతే దీనిపై క్లారిటీ రాలేదు. రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని.. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. రుణమాఫీ చేసి వారికి సమాధానం చెబుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు.

Show comments