P Krishna
Good News for Farmers: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్.
Good News for Farmers: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ అమలు తో పాటు రైతు సంక్షేమంపై దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త అందించారు. యాసంగి సీజన్ కి సంబంధించిన రైతు భరోసా (రైతు బంధు) కి సంబంధించిన పెండింగ్ డబ్బులు సోమవారం నుంచి రైతు ఖాతాల్లో జమచేయనున్నారు. ఖాజానాలోని నిధులను సర్ధుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రైతులకు కొంత వరకు ఊరట లభిస్తుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్ లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయి నేటి నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తయ్యింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు పెండింగ్ లో ఉన్న 39 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. ఇందుకోసం రూ.2 వేల కోట్లు సర్ధబాటు చేయాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ఖజానాలోని అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటున్న ఈ నిధులు ఈ నెల 7 వ తేదీన ప్రభుత్వ ఖాతాలోకి జమకానున్నాయి. ఆలోపై రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. గతంలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు ముందుగా సేకరించి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు తర్వాత వచచేలా సాఫ్ట్ వేర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అదే తరహాలో చెల్లింపుల కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల 5 ఎకరాల వరకే పరిమితి చేస్తామని ప్రచారం జరిగింది.. కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవలని తెలిపింది. గతంలో మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న పట్టాదారులందరికీ, ధరణి పోర్టల్ లో ఎమ్మార్వో డిజిటల్ సంతకం అయిన రైతులందరికీ ప్రభుత్వ నగదు బదిలీ చెల్లిస్తుంది. కటాఫ్ లేకుండా పరిమితి విధించకుండా రైతుబంధు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు మరో గుడ్ న్యూస్.. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులకు ఎరరానికి రూ.10 వేల చొప్పన నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.