iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క పని చేయొద్దు అన్నందుకు.. ఎంత పనిచేశావ్ తల్లీ!

  • Published Apr 10, 2024 | 9:08 AM Updated Updated Apr 10, 2024 | 9:08 AM

Kachiguda Girl Issue: నేటి సమాజంలో టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

Kachiguda Girl Issue: నేటి సమాజంలో టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఆ ఒక్క పని చేయొద్దు అన్నందుకు.. ఎంత పనిచేశావ్ తల్లీ!

గత పదేళ్లుగా కమ్యూనికేషన్ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉంటుంది. ప్రస్తుతం కాలంలో సెల్ ఫోన్ చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా వాడుతున్నారు. ఎంతగా అంటే చిన్న పిల్లలు మారం చేస్తే ఫోన్ లో బొమ్మల వీడియోలు, పాటలు పెట్టి ఇస్తే సైలెంట్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ఇదిలా ఉంటే.. సెల్ ఫోన్ వల్ల ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో.. అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు నిపుణులు. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. సెల్ ఫోన్ లో మాట్లాడవొద్దని చెప్పినందుకు ఓ మైనర్ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మైనర్లను కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు ఆంక్షలు విధిస్తే.. మనస్థాపానికి గురై క్షణికావేశంలో సంచనల నిర్ణయాలు తీసుకొని కుటుంబాలో తీవ్ర విషాదం నింపుతున్నారు.   సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడవొద్దని చెప్పినందుకు ఓ మైనర్ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన కాచీగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాచీగూడ ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచీగూడలోని సుందర్ నగర్ లోని బంధువుల ఇంటికి వచ్చారు.

బాలజీరావు కూతురు సీహెచ్ గౌర్ సెల్ ఫోన్ లో అతిగా మాట్లాడుతుంది. ఇది గమనించిన తల్లి, సోదరుడు పదే పదే ఎందుకు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నావ్.. ఎవరితో మాట్లాడుతునన్నావ్ అంటూ సీరియస్ గా మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గౌరి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తనతో పాటు సెల్ ఫోన్ కూడా తీసుకు వెళ్లింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టు పక్కల ప్రాంతాలు వెతికారు. తెలిసిన వారందరికీ ఫోన్ చేసి తమ కూతురు గురించి ఎంక్వేయిరీ చేశారు. కానీ ఎక్కడా గౌరీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె సోదరుడు విష్ణు కార్తి కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.