iDreamPost
android-app
ios-app

ఆ కారణంతో.. రైలు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి!

  • Published Jan 06, 2024 | 11:36 AM Updated Updated Jan 06, 2024 | 12:24 PM

రెండో సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆ కారణంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

రెండో సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆ కారణంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ కారణంతో.. రైలు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి!

దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారీ డ్రగ్స్. మత్తు పదార్థాల నివారణకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిలువరించలేకపోతున్నారు. డ్రగ్స్ మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుని ఆ తర్వాత దానికి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యసనం నుంచి బయటపడలేక మానసికంగా కృంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదే రీతిలో ఓ బీటెక్ స్టూడెంట్ గంజాయికి బానిసై దాని నుంచి బయటపడలేక చివరికి రైలు కిందపడి తనువు చాలించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. తల్లి దండ్రులు వారిపై పెట్టుకున్ననమ్మకాలను వమ్ము చేస్తూ తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. గంజాయికి బానిసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్‌ నుంచి సనత్‌నగర్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అతని దగ్గర దొరికిన పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా ఆ యువకుడిని విజయ్ కుమార్ గా గుర్తించారు. విజయకుమార్‌ నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు అతడు చదువుతున్న కాలేజీ యాజమాన్యానికి, చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

A BTech student died in a train crash!

కాగా విజయ్‌కుమార్ ఘట్‌కేసర్‌లోని ఓ కళాశాలలో డిప్లమో చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటుపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇంజినీరింగ్‌ కాలేజీలో చేర్పించినా విజయ్ కుమార్ లో మార్పు రాలేదని తండ్రి శ్రీనివాస్ తెలిపారు. బీటెక్ ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో చదువు మాన్పించి చర్లపల్లిలో చికెన్‌ సెంటర్‌ పెట్టించారు. విజయ్‌కుమార్‌ మానసికంగానూ కుంగిపోవడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎడిక్షన్‌ కేంద్రంలో చికిత్స చేయిస్తున్నారు.

ఆ తర్వాత మళ్లీ చదువుకుంటాను అని చెప్పడంతో తల్లిదండ్రులు విజయ్ కుమార్ ను నార్లపల్లిలోని ఓ కాలేజీలో సెకండియర్ లో చేర్పించారు. ఈ క్రమంలో కొంత కాలంగా తనకు బ్రతకాలని లేదని సూసైడ్ చేసుకుంటానని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులు ధైర్యం చెప్పినప్పటికీ విజయ్ కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి ఇంజనీరింగ్ విద్యార్థి గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.