Uppula Naresh
Uppula Naresh
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ నెల 23న బ్రైట్ కామ్ గ్రూప్ సంస్థలో దాడులు నిర్వహించించి రూ.3.3 కోట్ల నగదుతో పాటు రూ.9.3 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిందే. ఇది మరువక మందే తాజాగా ఆ కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, ఆడిటర్ ఇల్లు, ఆఫీసుల్లో సైతం శనివారం ఈడీ దాడులు నిర్వహించింది. అయితే ఈడీ అధికారులు ప్రధానంగా ఐదు చోట్ల దాడులు చేసినట్లుగా పేర్కొన్నారు. ఆడిటర్ మురళీమోహన్ ఇంట్లో నగదు, బంగారం స్వాధీనం చేసుకోగా, సీఎఫ్ఓ రాజు ఇంట్లో మాత్రం కంపెనీకి సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలను, హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. బ్రైట్ కామ్ లిమిటెడ్ కంపెనీ షేర్లను రూ.868 కోట్ల నగదును సమీకరించినట్లుగా కూడా అధికారులు గర్తించారు. దీంతో పాటు సంస్థ ఖాతాలో జమ చేసిన నగదును ఇతర డొల్ల కంపెనీలకు దాదాపు రూ.300 కోట్ల మళ్లీ భారీ మోసానికి పాల్పడినట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం ఈడీ అధికారలు ఫెమా నిబంధనలను ఉల్లఘించి ఈ చర్యలకు పాల్పడినందున సంస్థపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కంపెనీ అధికారులెవరూ ఏ హోదాలో విధులు కొనసాగించకూడదని కూడా హెచ్చరించింది. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC