iDreamPost

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC)ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ నెల 31న రాఖీ పండగ సందర్భంగా TSRTC 3 వేల స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సులను ఈ నెల 29, 30, 31 వరకు ప్రతీ రోజు 1000 ప్రత్యేక బస్సులను నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాఖీ పండగ నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కువగా ఉండే.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ హన్మకొండ, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, గోదావరి ఖని, మహబూబ్ నగర్, మంచిర్యాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. ఇక రాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్ తో పాటు ఎల్బీ నగర్ లో ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు సజ్జానర్.

ఇది కూడా చదవండి: చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో వరాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి