iDreamPost

తెలంగాణలో EAPCET ఫలితాలు విడుదల.. టాపర్స్ అంతా AP విద్యార్థులే

తెలంగాణలో తాజాగా విడుదలైన ఎప్ సెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల హవా కొనసాగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో టాపర్స్ అంతా ఏపీ విద్యార్థులే.

తెలంగాణలో తాజాగా విడుదలైన ఎప్ సెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల హవా కొనసాగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో టాపర్స్ అంతా ఏపీ విద్యార్థులే.

తెలంగాణలో EAPCET ఫలితాలు విడుదల.. టాపర్స్ అంతా AP విద్యార్థులే

ఫ్యూచర్ బాగుండాలని ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, ఫార్మసీ రంగాలవైపు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం ఎప్ సెట్ ఎంట్రన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు. ఇంజనీరింగ్, ఫార్మా సెక్టార్ లలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎప్ సెట్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ నెల 11న ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎప్ సెట్ పరీక్ష జరిగింది. తాజాగా టీఎస్ ఎప్ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కాగా ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదరగొట్టారు. ఎప్ సెట్ రిజల్ట్స్ లో ఏపీ విద్యార్థుల హవా కొనసాగింది. టాప్ ర్యాకులన్నీ వారే కైవసం చేసుకున్నారు.

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలను అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంతో పాటు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలోనూ ఏపీ విద్యార్థులు టాపర్స్‌గా నిలిచారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు ఫస్ట్‌ ర్యాంక్ కైవసం చేసుకుంది. విజయనగరానికి చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంక్ తో మెరిసాడు. గడ్డం శ్రీ వర్షిణికి మూడో ర్యాంకు రాగా,చిత్తూరు విద్యార్థి రాఘవ్ నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులపై అభినందనల వర్షం కురుస్తోంది. కాగా తెలంగాణలో ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రి కల్చర్ , ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. త్వరలోనే ఎప్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

అగ్రికల్చర్‌ & ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్స్..

1. ఆలూర్‌ ప్రణీత (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)
2. నాగదుర్గ రాధాకృష్ణ (విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌)
3. గడ్డం శ్రీ వర్షిణి (హన్మకొండ, వరంగల్‌)
4. సొంపల్లి సాకేత్‌ రాఘవ్‌ (చిత్తూర్‌, ఆంధ్రప్రదేశ్‌)
5. రేపల సాయి వివేక్‌ (హైదరాబాద్‌, తెలంగాణ)
6. మహ్మద్‌ అజాన్‌ సాద్‌ (ఉప్పల్‌, తెలంగాణ)
7. ముకేశ్‌ చౌదరి (తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌)
8. భార్గవ్‌ సుమంత్‌ (కుత్భుల్లాపూర్‌, హైదరాబాద్‌)
9. జయశెట్టి ఆదిత్య (కూకట్‌పల్లి, హైదరాబాద్‌)
10. పూల దివ్యతేజ (శ్రీ సత్యసాయి జిల్లా, ఆంద్రప్రదేశ్‌)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి