P Venkatesh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీనిపై స్పందించిన కేటీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన తీరుకు రామ్ గోపాల్ వర్మ కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీనిపై స్పందించిన కేటీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన తీరుకు రామ్ గోపాల్ వర్మ కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
P Venkatesh
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. హస్తం పార్టీ 65 స్థానాల్లో గెలుపొందింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక ఓటమిపై కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రెండు సార్లు అధికారం అందించిన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ రోజు ఫలితాలను చూస్తుంటే బాధ కంటే నిరాశ కలుగుతుందని తెలిపారు. ఈ ఫలితాలను మేము ఊహించలేదన్నారు. ఓటమి నుంచి గుణపాటం నేర్చుకుంటాము. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ తెలిపారు. ఇక దీనిపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వివరాలు మీకోసం..
తనకు అనిపించింది ముక్కుసూటిగా చెప్పే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ పలు విషయాలను వెల్లడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తాము. ప్రతిపక్ష హోదాలో సమర్దవంతంగా పనిచేస్తాము అని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కు ఓ స్పీడ్ బ్రేకర్ లాంటిదని, దీనికి బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కుంగిపోకూడదని ధైర్యం చెప్పారు. ఎక్కడ కోల్పపోయిన దాన్ని అక్కడే తెచ్చుకుందాం అని తెలిపారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ.. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన తీరుకు రామ్ గోపాల్ వర్మ మెచ్చుకున్నారు. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఓటమిని ఇంత సానుకులంగా తీసుకునే ఏ రాజకీయ నాయకుడిని నేను ఇంత వరకు చూడలేదు. మీకు అభినందనలు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీలాంటి వారు అవసరం అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఇక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పింపించారు కేసీఆర్. మరి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఆర్జీవీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In fact this will age very well sir ! That’s because I never saw any political leader taking his defeat in such a positive spirit ..KUDOS TO YOU💐💐💐 This is what’s needed for a HEALTHY DEMOCRACY 🙏🙏🙏 https://t.co/Fp00Y8MfKl
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023