P Venkatesh
విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్. సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఏకంగా ఎగ్జామ్ ఫీజుపై రాయితీ కల్పిస్తామని లక్షల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్. సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఏకంగా ఎగ్జామ్ ఫీజుపై రాయితీ కల్పిస్తామని లక్షల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
P Venkatesh
ప్రతీ ఏడు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు పై చదువుల కోసం వెళ్తుంటారు. ముఖ్యంగా యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యూఎస్ లో చదివితే భవిష్యత్ బాగుంటుందని, డాలర్లలో సంపాదించొచ్చని భావిస్తుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఫారిన్ లో చదివించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫారిన్ లో చదివే విద్యార్థులే టార్గెట్ గా మోసాలక పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇప్పటి వరకు ఉద్యోగాల పేరిట లక్షలు కాజేసిన సంఘటనలు చూశాం. ఇప్పుడు మరో కొత్త రకం మోసానికి తెరలేపారు. ఏకంగా ఎగ్జామ్ ఫీజులపై డిస్కౌంట్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నారు.
మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మోసాలకు పాల్పడే వారు ఏచిన్న అవకాశం దొరికినా కూడా వదలడం లేదు. ఈ క్రమంలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. యూఎస్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకుని లక్షల రూపాయలను కొల్లగొడుతున్నాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కనోళ్ల అశోక్ అనే యువకుడు గతంలో యూఎస్ఏ కన్సల్టెంట్ ఏజన్సీలో వర్క్ చేశాడు. అందులో ఉన్న అనుభవంతో ఈజీగా మనీ సంపాదించేందుకు స్టూడెంట్స్ సెమిస్టర్ ఫీజులను టార్గెట్ గా మలుచుకున్నాడు.
అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ సెమిస్టర్ ఫీజులన తమ ద్వారా చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని మోసానికి పాల్పడ్డాడు. సుధాకర్ అనే యువకుడికి ఫీజు చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని రూ.4 లక్షల 38 వేల 599 రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు అశోక్. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అశోక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఏజన్సీలను , ఏజెంట్లను నమ్మకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.