కానిస్టేబుళ్ల భార్యల ధర్నా.. భర్తలను సస్పెండ్ చేసిన అధికారులు.. కారణం ఏంటంటే?

ఎవరికైనా సమస్య వస్తే పోలీసులను సంప్రదిస్తారు. అదే పోలీసులకే సమస్య వస్తే.. ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసకుంది. తమ భర్తల సమస్యలను పరిష్కరించాలని కానిస్టేబుళ్ల భార్యలు ధర్నాకు దిగారు. దీంతో వారి భర్తలను సస్పెండ్ చేసి షాకిచ్చారు.

ఎవరికైనా సమస్య వస్తే పోలీసులను సంప్రదిస్తారు. అదే పోలీసులకే సమస్య వస్తే.. ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసకుంది. తమ భర్తల సమస్యలను పరిష్కరించాలని కానిస్టేబుళ్ల భార్యలు ధర్నాకు దిగారు. దీంతో వారి భర్తలను సస్పెండ్ చేసి షాకిచ్చారు.

పోలీస్ డ్యూటీ కత్తిమీద సాములాంటిది. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. నేరాలను అదుపు చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంలో పోలీసుల సేవలు మరువలేనివి. కుటుంబాలను విడిచి రక్షణలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా వేసి రక్షిస్తుంటారు. పోలీసులు ప్రాణం కంటే డ్యూటీకే ప్రాధాన్యతనిస్తుంటారు. విధుల్లో ఒత్తిడి ఉన్నా సేవలందించేందుకు వెనకాడరు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగులు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తమ సమస్యలను పరిష్కారించాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతుంటారు. ఇదే విధంగా కానిస్టేబుళ్ల భార్యలు తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కారు.

అయితే భార్యలు చేసిన పనికి భర్తలను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. భార్యల ధర్నాతో కానిస్టేబుళ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నల్గొండలో ఉన్న 12 బెటాలియన్ ముందు కానిస్టేబుల్ భార్యలు సోమవారం (అక్టోబర్ 21 ) రోజున ధర్నా నిర్వహించారు. వందల మంది పోలీసుల భార్యలు నిరసనలకు దిగారు. వారి భర్తలపై పనిభారం తగ్గించాలని, అర్డర్లీ వ్యవస్థను రద్దు చేయటంతో పాటు.. కామన్ మెస్ తీసివేయాలని, రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని, కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బెటాలియన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసుల భార్యల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బెటాలియన్ ఉన్నతాధికారులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఇలా సస్పెండ్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే సస్పెండ్ ఎందుకు చేస్తున్నారని అడిగిన కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ వారు ఏం చెప్పారంటే.. మీ భార్యలు ధర్నా చేశారు. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం అని ఉన్నతాధికారులు బదులిచ్చారు.

అయితే సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లలో కొందరు తమ భార్యలు ధర్నా చేస్తే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. చాలామంది ధర్నాలో పాల్గొనగా తమపై మాత్రమే కక్ష సాధింపు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని కానిస్టేబుళ్లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ పోలీసులందరు న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి భార్యలు ధర్నా చేస్తే భర్తలను సస్పెండ్ చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments