iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ కేబినెట్ ఇదేనా? అదృష్టం వరించేది ఎవరినంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కేబినేట్ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కేబినేట్ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

కాంగ్రెస్ కేబినెట్ ఇదేనా? అదృష్టం వరించేది ఎవరినంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. నెల రోజుల పాటు సాగిన ఈ కురుక్షేత్రంలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు పదేళ్లు పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. చాలా ఏళ్ల తరువాత ఈసారి కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం దక్కింది. రేవంత్ రెడ్డి కెప్టెన్సీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుటా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ విజయానికి అనేక అంశాలు తోడయ్యాయి.

ఇది ఇలా ఉంటే.. సీఎం రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖ నేతల పేర్లు వినిపిస్తోన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న మంత్రి వర్గంలో ఉండే నేతలు వీరే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. 65 స్థానాల్లో హస్తం విజయం సాధించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో సంతోషంతో స్వీట్లు పంచుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్ట్ తో రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ గవర్నర్ కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని గవర్నర్ తెలపనున్నారు. అంతేకాక గెలిచిన అభ్యర్థులతో రేపు సమావేశం అవుతామని డీకే శివకుమార్ తెలిపారు.

ఈనేపథ్యంలో సీఎం రేసులో ఎవరు ఉంటారు అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. వీటిని పక్కన పెడితే.. కాంగ్రెస్ కేబినెట్ ఎలా ఉండనుంది. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులు కానున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. కులసమీకరణల లెక్కలు బట్టి .. కొందరి పేర్లు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాల నుంచి భట్టీ విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్రపోషించారు. దీంతో కాంగ్రెస్ మంత్రివర్గంలో వీరిద్దరికి చోటు ఉండొచ్చని కొందరు అభిప్రాయా పడుతున్నారు. వీరితో పాటు మరో నేత తుమ్మల నాగేశ్వరావుకు కూడా అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అలానే జి వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహకు కూడా కేబినేట్ లో చోటు దక్కే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. దామోదర్ రాజనర్సింహ..వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాబినేట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. అదే ఆయన కు ఈసారి కూడా మంత్రి మండలిలో అవకాశం వచ్చేందుకు ప్రధాన కారణం కావచ్చని టాక్.

ఇక కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నల్గొండను కాంగ్రెస్ కంచుకోటగా మార్చడంలో వీరిది కీలక పాత్ర ఉంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి కూడా కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గుగ్గిల శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకి మంత్రి వర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈమె రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరురాలు.. అదే ఆమెకు మంత్రిగా చేయోచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇలానే వరంగల్ జిల్లాలో కీలక నేత కొండ సురేఖ , మదన్ మోహన్, గడ్డం ప్రసాద్ కుమార్, విజయ్ రమణరావు వంటి నేతలకు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

వీళ్లంతా తమ నియోజకవర్గాల్లో గెలిచిన వారే. దీంతో వీరందరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో అనుకోకుండా కొన్ని కొత్త పేర్లు కూడా తెరపైకి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.రేవంత్ రెడ్డినే తమ సీఎంగా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి.. కాంగ్రెస్ కేబినెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న పేర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.