ఎన్నికల రిజల్ట్స్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, BRS.. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..!

ఎన్నికల రిజల్ట్స్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, BRS.. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..!

Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ నడుస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య హూరాహూరిగా పోటీ నడుస్తుంది.

Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ నడుస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య హూరాహూరిగా పోటీ నడుస్తుంది.

దేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హూరాహూరీ పోరు కొనసాగుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో సైతం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉత్కంఠంగా పోరు కొనసాగుతుంది.   పదేళ్లు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ఒక్కసీటుతో ముందంజలో ఉన్నప్పటికీ మళ్లీ వెనక్కి వెళ్లింది. ఇక ఎంఐఎం సైతం ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికలు త్రిముఖ పోటీ అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఏకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అధినేతలు హూరా హూరిగా ప్రచారం చేశారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు కనీసం 14 స్థానాలు కైవసం చేసుకుంటామని చెబుతూ వచ్చిది బీఆర్ఎస్. కానీ.. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాల్లో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా ముందంజలో నిలవలేకపోయింది. ఇక ఎంఐఎం పరిస్థితి అంతే ఉంది.. ఒకే ఒక్కసీటుతో ముందంజలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ వస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపి, కాంగ్రెస్ సత్త చాటుతూ వచ్చాయి. తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరు ఉన్న మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అత్యధికంలో కొనసాగుతున్నారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కాకపోతే మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థిని మాధవి లత ముందంజలో కొనసాగారు. మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, జహిరాబాద్, పెద్దపల్లి, మహబూబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

Show comments