Skill University: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆనంద్ మహీంద్రాకు కీలక బాధ్యతలు!

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆనంద్ మహీంద్రాకు కీలక బాధ్యతలు!

Skill University: తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిల్క్ వర్సిటీ విషయంలో కీలక ప్రకటన చేశారు.

Skill University: తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిల్క్ వర్సిటీ విషయంలో కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది. ఆగష్టు 1న రంగారెడ్డి జిల్లాని ముచ్చెర్లలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో తెలిపారు. యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇలా నిరుదోగ్య యువత కోసం ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్కిల్ వర్సిటీకి ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్  ఉంటారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉండనున్నారు. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్ఆర్ ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను ఆహ్వానించారు. ఇటీవలే యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పబ్లిక్ ప్రైవేట్‌ (పీపీ) భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ నిర్మించనున్నారు.

ఈ యూనివర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే సంవత్సరం  నుంచి ఇక్కడి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానునట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోని ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద మహేంద్రాను చైర్మన్ గా చేస్తూ సీఎం ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా సమావేశమయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీని పరిశీలించేందుకు తన బృందాన్ని పంపుతానన్నారు ఆనంద్ మహీంద్రా. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన  బిల్లు కు ఆమోద ముద్రపడింది.

Show comments