iDreamPost
android-app
ios-app

HYDలో విషాదం.. బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగిలి ఆర్మీ అధికారి మృతి!

గాలి పటాలను ఎగిరేసేందుకు వాడేటువంటి చైనా మాంజా మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు తీసింది.

గాలి పటాలను ఎగిరేసేందుకు వాడేటువంటి చైనా మాంజా మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు తీసింది.

HYDలో విషాదం.. బైక్ పై వెళ్తుండగా  చైనా మాంజా  మెడకు తగిలి ఆర్మీ అధికారి మృతి!

సంక్రాంతి పండగ మొదలవుతుందంటే చాలు చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తుంటారు. వివిధ వర్ణాలతో కూడిన కైట్స్ ఆకాశమంతా నిండిపోతాయి. అయితే ఈ పతంగులు ఎగుర వేసేటప్పుడు ప్రమాదాల భారిన పడి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. పతంగులను ఎగిరేసే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించి కరెంట్ షాక్ కు గురై మరణిస్తున్నారు. మరికొందరు బిల్డింగులపైకి చేరి గాలిపటాలను ఎగుర వేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మరణిస్తున్నారు. ఈ క్రమంలో గాలి పటాలను ఎగిరేసేందుకు వాడేటువంటి చైనా మాంజా మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు తీసింది.

గాలిపటాలు ఎగిరేసే వారు అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రమాదాలకు గురవడంతో పాటు ఇతరుల చావులకు కూడా కారణమవుతున్నారు. చైనా మాంజాను వాడకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వద్దన్నా వినకుండా చైనా మాంజాలను వాడి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో బైక్ పై వెళ్తున్న ఆర్మీ అధికారి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆయనను స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు(30) ఆర్మీ అధికారి(నాయక్ ) గా లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఈయన లంగర్ హౌస్ లోని బాపునగర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో కోటేశ్వరరావు శనివారం రాత్రి ఆయన విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో లంగర్ హౌస్ లోని ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న సమయంలో ఆయన మెడకు మాంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా అటుగా వెళ్తున్న వారు గమనించి ఆర్మీ అధికారిని స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు సందర్శించి నివాళులు అర్పించారు. ఆదివారం మృతుడి భార్య ప్రత్యుష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. మరి చైనా మాంజా మెడకు తగిలి ఆర్మీ అధికారి మృతి చెందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి