ఎలక్షన్ రిజల్ట్స్: ఎన్నికల్లో BRSకు భారీ ఝలక్..ఇప్పటి వరకు ఒకే ఒక్క స్థానం!

Elections 2024 Results: ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల గురించి నాయకులు, ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

Elections 2024 Results: ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల గురించి నాయకులు, ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై నాయకులే కాదు.. ప్రజలు సైతం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ మాత్రం ఒక్కస్థానానికే పరిమితం అయినట్లు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..

గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పార్టీని గెలిపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం అంటూ మొన్నటి వరకు ముమ్మర ప్రచారం చేశారు బీఆర్ఎస్ నేతలు. మే 13న పార్లమెంట్ ఎన్నికల జరిగాయి.. మంగళవారం (జూన్ 4) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంటే.. బీఆర్ఎస్ మాత్రం ఒకే ఒక్కస్థానం లో ముందంజలో ఉంది. దానితో పాటు ఎంఐఎం 1 స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో బీఆర్ఎస్ ఒకే ఒక్క సీటుకే పరిమిత అయ్యింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచారు. అప్పటి నుంచి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించింది. అయితే గత ఏడాది ఎన్నికల ముందు జరిగిన కీలక పరిణామాలు బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఈ వ్యతిరేకత ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడటంతో ఓటమి పాలయ్యింది.  ప్రతిపక్ష హోదాలో ఉంటూ తమ ప్రాబల్యం చాటుకోవాలని చూసిన బీఆర్ఎస్ కి లోక్ సభలో కూడా చేదు అనుభవం ఎదురైనట్లే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Show comments