P Venkatesh
Nikhat Zareen DSP: నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆమెకు డీఎస్‌పీ పదవిని కేటాయించింది. బుధవారం బాక్సర్ నిఖత్ జరీన్ కు డీఎస్పీగా ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ జితేందర్రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
Nikhat Zareen DSP: నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆమెకు డీఎస్‌పీ పదవిని కేటాయించింది. బుధవారం బాక్సర్ నిఖత్ జరీన్ కు డీఎస్పీగా ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ జితేందర్రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
P Venkatesh
క్రీడలను కెరీర్ గా మలుచుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సక్సెస్ రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే పేరెంట్స్ కూడా తమ పిల్లలను స్పోర్ట్స్ వైపు కాకుండా ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తుంటారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి యువత స్పోర్ట్స్ ను కెరీర్ గా మలుచుకుని రాణిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెడుతున్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటుతున్నారు. ఇదే రీతిలో తెలంగాణ ముద్దుబిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ ను సాధించి కీర్తి గడించింది. ఈ క్రమంలో నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆమెకు డీఎస్‌పీ పదవిని కేటాయించింది. బుధవారం బాక్సర్ నిఖత్ జరీన్ కు డీఎస్పీగా ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ జితేందర్రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్‌ని తెలంగాణ పోలీస్ విభాగంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా బాధ్యతలు చేపట్టింది. ఆమె అద్భుతమైన విజయాలు తెలంగాణకు స్ఫూర్తినిస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆమె అందించే సేవ కోసం మేము ఎదురుచూస్తున్నాము అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన నిఖత్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించింది.
We proudly welcome two-time world boxing champion and Olympic athlete, @nikhat_zareen, as she takes on her new role as Deputy Superintendent of Police (Special Police). Hailing from Nizamabad, she submitted her joining report to me today. Her remarkable achievements inspire… pic.twitter.com/3cmOczmcQW
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 18, 2024