Keerthi
గత కొన్ని రోజులుగా రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తెలంగాణలోని ఆ ప్రాంతం గుండా కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
గత కొన్ని రోజులుగా రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తెలంగాణలోని ఆ ప్రాంతం గుండా కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Keerthi
నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే.. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వేశాఖ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమత్తులు చేయడం, రైల్వే స్టేషన్లు నిర్మించిడం, కొత్తగా రైలు మార్గాలను ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రాంత వాసులకు రైల్వే శాఖ తీపి కబురును చెప్పింది. త్వరలోనే మరో కొత్త రైలు మార్గం అందుబాటులోకి రాబోతుంది. ఇంతకీ ఆ కొత్త రైలు మార్గం ఎక్కడ ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తెలంగాణలోని మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే ఈ కొత్త ట్రైన్ మార్గం అనేది దక్షిన అయోధయగా పేరు గాంచిన భద్రాద్రికి మార్గం గుండా వేయనున్నారు. ముఖ్యంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ ట్రైన్ మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే వచ్చే ఐదేళ్లలో అనగా.. 2029-30 కల్లా ఈ రైలు మార్గం ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలని రైల్వేశాఖ టార్గెట్ పెట్టుకుందట. ఇకపోతే ఈ ట్రైన్ మార్గంలో ఒక్క లెవల్ క్రాసింగ్ కూడా లేకుండా నిర్మించేలా డిజైన్ రూపొందించారు. కాగా, ట్రైన్ మార్గం మొత్తం పొడవు వు 200.60 కి.మీ. అయితే ఈ మార్గంలో ఏకంగా 301 వంతెనలను నిర్మించనున్నారు. అంటే ప్రతి రెండు కిలోమీటర్లకు మూడు బ్రిడ్జిలు చొప్పున నిర్మించనున్నారు.
అలాగే ఈ ట్రైన్ మార్గంలో మూడు భారీ వంతెనలు, 34 పెద్ద వంతెనలు,264 చిన్న వంతెనలు, 41 ఆర్వోబీలు, 76 ఆర్ యూబీలు నిర్మించనున్నారు. ఇకపోతే మల్కన్ గిరి వయా భద్రాచలం నుంచి పాండురంగాపురం మార్గంలో నిర్మించే ఈ కొత్త రైల్వే మార్గంలో 14 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కానీ, అవి ఏ ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అనే విషయాలను తెలియజేయలేదు. కాకపోతే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే భద్రాచలం వద్ద గోదావరి నదిపై భారీ వంతెన నిర్మించేందుకు డీపీఆర్ ఇప్పటికే అంత సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మల్కన్ గిరి నుంచి భద్రాచలం వరకు మాత్రమే ట్రైన్ మార్గం నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న ఖనిజ సంపద రవాణాకు వీలుగా.. భద్రాచలానికిక 20 కి. మీ దూరంలోని పాండురంగాపురం వరకు పొడిగించారు.
అయితే డోర్నకల్-మణుగూరు మధ్యలో ఈ పాండరంగాపురం ఉంటుంది. ఈ ట్రైన్ లైన్ ఖాజీపేట-విజయవాడ ప్రధాన ట్రైన్ మార్గానికి బ్రాంచి లైన్‌గా ఉంది. ఈ క్రమంలోనే.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఖనిజ సంపద, బొగ్గును భద్రాచలం, పాండురంగాపురం నుంచి వరంగల్ జిల్లా ఖాజీపేట మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించనున్నారు. దీంతో పాటు విజయవాడ మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఖనిజ సంపద రవాణా చేసేందుకు ఈ ట్రైన్ మార్గం ఉపయోగపడనుంది. ఇక కొత్త ట్రైన్ మార్గం రాకతో కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే తమిళనాడు రవాణాకు ఈ రైలు మార్గం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ, త్వరలోనే భద్రాచలం నుంచి పాండురంగాపురంకు ఈ ట్రైన్ మార్గాన్ని నిర్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.