iDreamPost
android-app
ios-app

వీడియో: తెలంగాణలో పవన్ కి మద్దతుపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడి. అలాంటి వ్యక్తి పవన్ కి మద్దతు ఇచ్చే విషయంలో ఆసక్తికర సమాధానం చెప్పారు.

తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడి. అలాంటి వ్యక్తి పవన్ కి మద్దతు ఇచ్చే విషయంలో ఆసక్తికర సమాధానం చెప్పారు.

వీడియో: తెలంగాణలో పవన్ కి మద్దతుపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బండ్ల గణేష్.. సినీ, రాజకీయలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాక బండ్ల గణేష్ అనగానే గుర్తుకు వచ్చేది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. కారణంగా పవన్ పై గణేష్ చూపించే ప్రేమ, అభిమానం శృతిమించి ఉంటాయి. ఎంతలా అంటే పవన్ కల్యాణ్ తన దేవుడని భావించడమే కాకుండా ఆయనపై గణేష్ ఎనలేని భక్తిని చూపిస్తూ ఉంటారు. అలాంటి  పవన్ కల్యాణ్  తెలంగాణలో పోటీ చేస్తున్నారు. మరి.. ఆయనకు మద్దతు ఇస్తారా? అని మీడియా బండ్ల గణేష్ ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా రసవత్తరంగా ఉంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇక పవన్ కల్యాణ్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నారు. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ కు బండ్ల గణేష్ ఓ కార్యకర్తల పని చేస్తున్నాడు. ఈ సారి విచిత్రంగా తన సినీ దేవుడు ఒకవైపు.. రాజకీయాల్లో తన ఇష్టపడే పార్టీ మరోవైపు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గణేష్ పవన్ కి మద్దతు ఇస్తారనే సందేహలు అందరిలో ఉన్నాయి. అయితే బుధవారం మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని, ఆ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని.. మీకు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారని ఆయనకు మద్దతు ఇస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. బండ్ల గణేష్ ఆసక్తిక సమాధానం చెప్పారు.

“పవన్ కల్యాణ్ గారిని పోటీ చేయోద్దని నేను ఎలా చెప్పగలను. పవన్ కల్యాణ్ నాకు దేవుడితో సమానం. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా నాకు దేవుడితో సమానం. నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నా రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పవన్ కల్యాణ్ గారిని.. మీరు పోటీ చేయవద్దని నేను ఎలా చెప్పగలను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పవన్ కల్యాణ్ కి ఎలా మద్దతు ఇస్తాను” అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతుందని.. డిసెంబర్ 9న సీఎంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బండ్ల గణేష్ అన్నారు.  మరి.. పవన్ కల్యాణ్ కి మద్దతు ఇచ్చే విషయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.