iDreamPost
android-app
ios-app

దసరా వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

దసరా వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తాజాగా మరో శుభవార్త చెప్పింది. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపింది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5265 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రానున్న బతుకమ్మ, దసరా పండుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు దిశగా TSRTC నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఆయా శాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే ఆస్కారం ఉండడంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అదనంగా మరో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు కూడా ఆయన వివరించారు.