తెలంగాణ స్కిల్ వర్సిటీ పై.. ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం

తెలంగాణ స్కిల్ వర్సిటీ పై.. ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ యూనివర్సిటీ పై స్పందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ యూనివర్సిటీ పై స్పందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే  ప్రభుత్వం తగిన కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు  ప్రైవేటు సంస్థల్లో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా తీసుకొని ఇటీవలే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, దీనిని రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఇటీవలే సీఎం రేవంత్ ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. ఇక ఇందులో మెుత్తం 17 స్కిల్ కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించే విధంగా నిర్ణయం తీసుకున్నమన్నారు. అయితే ఈ యూనివిర్సిటీ పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యూనివర్సిటీ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తాజాగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.  నిన్న ( శుక్రవారం) రాత్రి ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో  కలిశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై పరస్పరం చర్చించారు. అప్పుడే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించి సీఎం రేవంత్ ఆయనకు వివరించారు.

ఇందులో భాగంగానే.. స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన ‘ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌’ను తాము దత్తత తీసుకుంటామని ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. ఇక ఆ కోర్సుకు సంబంధించి ప్రణాళిక కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని త్వరలోనే రాష్ట్రానికి పంపుతామని ఆనంద్ మహీంద్ర తెలిపారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా ‘హాలిడే రిసార్ట్’ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు. ఇక ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారు. పైగా ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌’ కోర్సును దత్తత తీసుకుంటామని మహీంద్ర ప్రకటించటం పట్ల సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.

ఇకపోతే  ఈ ఏడాదికే ఈ స్కిల్ వర్సిటీలోని ఆరు కోర్సులకు రెండు వేల మందికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.  అలాగే ఏడాదికి రూ.50 వేలు నామ మాత్రపు ఫీజుతో స్కిల్ కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ఇక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నయని తెలిపారు. దీంతో పాటు భవిష్యత్లో జిల్లాల్లోనూ స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.  మరీ, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో భాగమైన ‘ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌’ ను ఆనంద్ మహీంద్ర దత్తతు తీసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments