Vinay Kola
Telangana: తెలంగాణలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని బ్రతికి ఉండగానే శ్మశానంలో పదేశారు వృద్ధులు.
Telangana: తెలంగాణలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని బ్రతికి ఉండగానే శ్మశానంలో పదేశారు వృద్ధులు.
Vinay Kola
మానవత్వం మంట కలిసిపోతుంది. మనుషులు మృగాళ్లా తయారవుతున్నారు. తమ స్వార్ధం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సాటి మనిషికి సాయం చేసే రోజులు వెళ్లిపోయాయి. కనీసం సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోట్లేదు. దారుణంగా రోడ్డున పడేసి రోజులు వచ్చేశాయి. జాలి,ప్రేమ,దయ,కరుణ అనే పదాలు కనుమరుగవుతున్నాయి. మనిషి తన సుఖాల కోసం ఎంతకైనా దిగజారే రోజులు వచ్చేశాయి. స్వచ్ఛమైన మనిషి మాయమైపోతున్నాడు. మనిషన్న వాడు అనే వాక్యం రోజురోజుకి సాధారణ వాఖ్యంగా మారిపోతుంది. బంధాలు, బంధుత్వాలు అర్ధాలు పూర్తిగా మారిపోయాయి. స్వార్ధం రాజ్యమేలుతుంది.. ఈ వ్యాఖ్యలకు తాజాగా జరిగిన విషాద సంఘటన ఉదాహరణగా మారింది. బతికుండగానే ఓ వృద్దురాలిని బంధువులు శ్మశానంలో పడేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ దారుణాతి దారుణమైన ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల నుంచి తెలుస్తున్న ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కూకట్ల రాజవ్వ అనే 75 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె గతంలో శానిటేషన్ కార్మికురాలిగా పని చేసింది. అయితే సాఫీగా సాగుతున్న తన జీవితంలో ఓ మలుపు చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోయారు. ఆయన మరణం నేడు రాజవ్వని దిక్కులేని వృద్ధురాలిగా మార్చింది. తన భర్త చనిపోయాక పిల్లలు లేకపోవడంతో ఆమె తన అన్న ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల కిందట రాజవ్వకు తీవ్ర అనారోగ్యం కలిగింది. దాంతో ఆమె మంచం పట్టింది. దీంతో ఆమె మేనల్లుడు తిరుపతి.. ఆడ మనిషి పైగా వృద్ధురాలు అనే కనీస కనికరం లేకుండా ఆమెను తీసుకుని వెళ్లి శ్మశానంలో పడేసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు రాజవ్వ పరిస్థితి తెలుసుకుని చాలా జాలి పడ్డారు. ఆగ్రహంతో మంగళవారం తిరుపతిని నిలదీశారు. కానీ ఆమె సోదరి పిల్లలు తాము చూసుకుంటామని తీసుకెళ్లారని…కానీ ఇలా శ్మశానంలో పడేశారని తిరుపతి చెప్పాడు.
ఏది ఏమైనా ఇలా బతికున్న మనిషిని సొంత అన్న, సోదరి పిల్లలు శ్మశానంలో పడేయటం చాలా దారుణం. ఈ దారుణమైన ఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. ఈ విషయం గురించి తెలిసిన వారు ఊరుకోలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని రాజవ్వ బంధువులను ఆరా తీశారు. రాజవ్వ బంధువులతో మాట్లాడి ఆమె బాగోగులు చూసుకునేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆమె బంధువులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంత దారుణం.. ఇలా సొంత కుటుంబీకులే వృద్ధురాలు అనే కనికరం లేకుండా బ్రతికుండాగానే శ్మశానంలో పడేశారు. ఈ దారుణమైన ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.