P Krishna
Hyderabad: దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల కొంతమంది తమ పరిస్థితులకు అనుగుణంగా లింగమార్పు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటిది భారత దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
Hyderabad: దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల కొంతమంది తమ పరిస్థితులకు అనుగుణంగా లింగమార్పు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటిది భారత దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
P Krishna
దేశంలో ఇప్పటి వరకు ఎంతోమంది లింగ మార్పు చేసుకొని తమ గుర్తింపు మార్చుకున్న వారిని చూశారు.. అయితే భారత దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) కు చెందిన సీనియర్ అధికారిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో పేరు, జండర్ మార్చుకున్నారు. ఈ మేరకు సదరు ఐఆర్ఎస్ అధికారి చేసిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆమోద ముద్ద వేసింది. ఇలాంటి కీలక పరిణామం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఇలా పేరు, జండర్ మార్చుకున్న ఆఫీసర్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే పనిచేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) లో పని చేస్తున్నా మహిళా అధికారి తన పేరు, జండర్ మార్చుకున్నారు. దేశ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్నా.. ఇక నుంచి పురుషుడి హోదాలో కనిపించనున్నారు. హైదరాబాద్ లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ చీఫ్ కమీషనర్ ఆఫీస్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎం అనసూయ (35) ఇప్పుడు ఎం అనుకర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న అనుకతిర్ ను ఇక నుంచి పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ ఇప్పుడు అనుకతిర్ సూర్యగా గుర్తించనున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్ర నిర్ణయం ప్రకారం ‘ప్రగతి శీలమైంది’ గా ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పేర్కొన్నారు. దేశంలో లింగ వైవిద్యం పట్ల సానుకూలతను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఎం అనుకర్ సూర్య విషయానికి వస్తే.. 2013 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఎం అనసూయ. 2018లో డిప్యూటీ కమిషనర్ గా ప్రమోషన్ పొందారు. గత ఏడాది నుంచి హైదరాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచ్‌లర్ డిగ్రీ చదివారు. భోపాల్ లోని నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీలో 2023 లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్ లో పీజీ డిప్లమా పూర్తిచేశారు. ఈ ఆర్డర్ పై సీనియర్ ఐఆర్ఎస్ అధికారులు స్పందిస్తూ.. ప్రోగ్రెసీవ్ చర్యగా ప్రశంసించారు. ఈ అంశం ప్రభుత్వ పాత్రల్లో జండర్ చేరిక, గుర్తింపు కోసం చారిత్రాత్మక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.