iDreamPost
android-app
ios-app

తోకతో జన్మించిన మగ శిశువు.. ఎక్కడంటే?

  • Published Jul 17, 2024 | 11:05 AMUpdated Jul 17, 2024 | 11:05 AM

సహజంగా ఏ మానవుడికి అయిన రెండు కాళ్లు, రెండు చేతులు ఉంటాయి. కానీ, అలా కాకుండా.. శరీరంలో ఏ భాగాలు తక్కువైనా, ఎక్కువైనా కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ శిశువు కూడా తోక జన్మించిన వింత ఘటన చోటు చేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..

సహజంగా ఏ మానవుడికి అయిన రెండు కాళ్లు, రెండు చేతులు ఉంటాయి. కానీ, అలా కాకుండా.. శరీరంలో ఏ భాగాలు తక్కువైనా, ఎక్కువైనా కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ శిశువు కూడా తోక జన్మించిన వింత ఘటన చోటు చేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 17, 2024 | 11:05 AMUpdated Jul 17, 2024 | 11:05 AM
తోకతో జన్మించిన మగ శిశువు.. ఎక్కడంటే?

సాధారణంగా అప్పుడే పుట్టిన కొంతమంది పిల్లలు జన్యుపరమైన లోపం ఉండటంతో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా జన్మిస్తుంటారు. ఈ క్రమంలోనే.. కొంతమంది ఆరు వేళ్లతో, నాలుగు కాళ్లతో,మూడు కల్లుతో ఇలా రకరాలుగా జన్మిస్తుంటారు. ఇక వారిని వైద్యులు సర్జరీ చేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. ఇలా వైద్య చరిత్రలో ఇలాంటి అరుదైన ఘటనలు చాలానే వినే ఉంటాం. కానీ, అప్పుడప్పుడు కొందరు పిల్లలు మాత్రం జంతువుల పోలికలతో జన్మించారనే వార్తలు మనం వింటునే ఉంటాం. అయితే తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సంఘటన కూడా అలాంటిందే. ఇక సృష్టిలో జంతువులకు తోకలు ఉంటాయని అందరికీ తెలుసు.కానీ, మనిషులకు తోకలు ఉండటం అనేది ఎక్కడ వినడం, చూడటం అనేది జరగలేదు. కానీ, ఓ శిశువు మాత్రం పుట్టినప్పుడు తోకతో పుట్టడం డాక్టర్లకు ఆశ్చర్యనికి గురి చేసింది.ఇంతకి ఎక్కడంటే..

సహజంగా ఏ మానవుడికి అయిన రెండు కాళ్లు, రెండు చేతులు ఉంటాయి. కానీ, అలా కాకుండా.. శరీరంలో ఏ భాగాలు తక్కువైనా, ఎక్కువైనా కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ శిశువు కూడా తోక జన్మించిన వింత ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక ఆ వివరాళ్లోక వెళ్తే.. హైదారబాద్ లోని గతేడాది అక్టోబర్‌లో ఓ మహిళ పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ శిశువు పుట్టడమే తోకతో పుట్టాడు.  ఇక ఆ దృశ్యన్ని చూసినడాక్టర్లు అశ్చర్యపోయారు. అత్యంత అరుదుగా కొంతమంది పిల్లలు ఇలా తోకతో పుడతారని తెలిపారు. అయితే ఆ పిల్లాడికి మూడు నెలలు నిండే సరికి ఆ తోక దాదాపు  15 సెంటీ మీటర్ల పొడవు పెరిగింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో బీబీనగర్‌ ఎయిమ్స్‌ డాక్టర్లను కలిశారు.

ఇక చిన్నపిల్లల శస్త్ర చికిత్సా విభాగాధిపతి డాక్టర్ శశాంక్ పండా తన వైద్యబృందంతో కలిసి బాబును పరీక్షించారు. తోక వెన్నెముకలో అయిదు వెన్నుపూసలతో ఈ తోక అనుసంధానమై బయటకు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో వెంటనే తోక నాడీ వ్యవస్థతో ముడిపడివున్నందున సర్జరీ అత్యంత క్లిష్టమైనదని డాక్టర్లు వెల్లడించారు. అయిన సరే రెండున్నర గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి తోకను తొలగించారు. ఈ నేపథ్యంలోనే అయిదు రోజులపాటు ఎయిమ్స్‌లో శిశువును ఇన్ పేషంట్‌గా ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. కానీ, సర్జరీ అయిన అనంతరం వైద్యులు ఈ శిశుు ఆరోగ్యంగా ఉండటం కష్టమని, నాడీ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందన్నారు.

అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సర్జీరీ తర్వాత శిశువుకు ఆరు నెలల కాలంలో ఎటువంటి నాడీ సంబంధిత సమస్య రాలేదు. పైగా తోకను తొలగించిన భాగంలో గాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుతం ఆ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇలా తోకతో ఇప్పటి వరకు దాదాపు 40 మంది చిన్నారులు జన్మిచారని, చాలా అరుదుగా జన్యు పరమైన లోపాల వల్ల ఇలా పిల్లలు తోకతో జన్మిస్తారని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి