70 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా విడుదల!

Khairatabad Ganesh: నగరంలో అత్యంత భారీ విగ్రహాంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతి గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతిని విగ్రహ ప్రతిష్ఠా నమునాలను ఉత్సవ కమిటీ నిర్వహకులు విడుదల చేశారు.

Khairatabad Ganesh: నగరంలో అత్యంత భారీ విగ్రహాంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతి గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతిని విగ్రహ ప్రతిష్ఠా నమునాలను ఉత్సవ కమిటీ నిర్వహకులు విడుదల చేశారు.

హిందువులు ప్రధానంగా జరుపుకున్న పండుగల్లో వినయకచవితి కూడా ఒకటి. అయితే ఈ పండుగను పల్లెలు, గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా.. చిన్న నుంచి పెద్ద వరకు దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే మహా నగరమైన హైదరాబాద్ లో ఈ వినాయక చవితి వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతిన వేడకలు నగరంలో చాలా ఫేమస్‌.

ఎందుకంటే.. నగరంలో అత్యంత భారీ విగ్రహాంగా ఈ ఖైరతాబాద్ వినాయకడు ప్రసిద్ధి. ఇక ఈ సప్తముఖి మహా గణపతిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడ నుంచే ప్రజలు ఆ మహాగణపతిని దర్శించుకునేందుకు బారులు తీస్తుంటారు. అయితే ఎప్పుడెప్పుడుడా అని ఎదురుచూస్తున్న ఈ పండుగ మరీ కొన్ని రోజుల్లో రానుంది. అయితే ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతిని విగ్రహ ప్రతిష్ఠా నమునాలను ఉత్సవ కమిటీ నిర్వహకులు విడుదల చేశారు. మరీ ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలై.. నేడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇ‍కపోతే ఎప్పటిలాగే..ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాల ప్రత్యేకతతో ఖైరతాబాద్‌ మహాగణపతి కనిపిస్తారు. వీటితో పాటు ఈ ఏడాది కొత్తగా.. కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేకతగా నిలుస్తుంది.

దీంతో పాటు ఎడమ వైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహు, కేతుల విగ్రహాలు, మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కుడి వైపు 15 అడుగుల మండపంలో తొమ్మిది అడుగుల ఎత్తులో లక్ష్మి, శ్రీనివాసుడి విగ్రహాలు, ఎడమవైపు మండపంలో అంతే ఎత్తులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేసి కల్యాణం ఏర్పాటు చేయనున్నారు. మరీ, ఈ ఏడాది ఖైరతాబాద్ సప్తముఖి మహా గణపతి విగ్రహ ప్రతిష్ఠా నమునాలపై మీ అభిప్రాయాలను కామెంట్స​్‌ రూపంలో తెలియజేయండి.

Show comments