Uppula Naresh
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ నెల చివరి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఏఏ రోజున సెలవులు ఉన్నాయంటే?
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ నెల చివరి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఏఏ రోజున సెలవులు ఉన్నాయంటే?
Uppula Naresh
తెలంగాణ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. నవంబర్ నెలలో వరుసగా 4 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అవును, మీరు చదివింది దాదాపుగా నిజమే కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్కూల్, కాలేజీ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో పబ్లిక్ హాలీడేలతో పాటు నవంబర్ 30న జరగనున్న ఎన్నికల పోలింగ్ రోజుతో కలిపి దాదాపు వరుసగా నాలుగు రోజుల సెలవులు రానున్నట్లు సమాచారం. అసలు నవంబర్ చివరి వారంలో నిజంగానే సెలవులు వస్తున్నాయా? వస్తే ఏఏ రోజున సెలవులు వస్తున్నాయి? నిజంగానే నాలుగు రోజుల పాటు హాలీడేస్ రానున్నాయా? ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ చివరి వారంలో దాదాపు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకు సెలవులు ఏఏ రోజు రానున్నాయంటే? నవంబర్ 26న ఆదివారం కావడంతో ఆ రోజు రెగ్యులర్ హాలీడేగా ఉంది. ఇక తిరిగి 27న సోమవారం కార్తీక పౌర్ణమి, దీంతో పాటు గురునానక్ జయంతి కావడంతో ఆ రోజు కూడా దాదాపు సెలవు దినం అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఎలాగో సెలవుగానే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పోలింగ్ ముందు రోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ నవంబర్ 29న గనుకు పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగ వరుసగా నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం ఉందని కొందరు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. మని నిజంగానే నవంబర్ 29న సెలవు ప్రకటిస్తారా? ఇంతకు ఏం జరగనుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.